లోకేశ్ ట్వీట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-21 18:15:50

లోకేశ్ ట్వీట్

శ్రీరెడ్డి చేత త‌న‌ను త‌న ఫ్యామిలీని దూషించార‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చేస్తున్న పోరాటం చివ‌ర‌కు ఇప్పుడు పొలిటిక‌ల్ ట‌ర్న్ లు తీసుకుంది.. దీని వెనుకు టీవీ9, ఏబీఎన్ అధినేత‌లు అలాగే టీవీ 9 ర‌విప్ర‌కాశ్, మంత్రి లోకేష్ అత‌ని స్నేహితుడు ఎటువంటి కుట్ర పన్నారో త‌న‌కు తెలుసు అని ఈ మీడియాల పై ఆయ‌న వ‌రుస ట్వీట్లు పెట్టారు.ఈ వివాదంలో మంత్రి లోకేష్ పేరును బ‌య‌ట‌పెట్ట‌డంతో ఇప్పుడు తెలుగుదేశం నాయ‌కులు ఆందోళ‌న చెందుతున్నారు.
 
ఆంధ్రప్రదేశ్ మంత్రి సీఎం  చంద్రబాబు తనయుడు లోకేష్ ట్విట్టర్ వేదికగా పవన్ చేసిన ట్వీట్లపై ప్రతి స్పందించారు. లోకేష్ ఏమన్నారంటే.... పవన్ కళ్యాణ్ గారు, మీ వ్యాఖ్యలు చాలా బాధించాయి. ఇంతకు ముందు కూడా నాపై వ్యక్తిగతంగా ఎన్నో ఆరోపణలు చేసి మళ్ళీ ఎవరో చెపితే అన్నానన్నారు. 
 
ఒక వ్యక్తి వ్యక్తిత్వం ఎన్నో ఏళ్ల శ్రమ ఫలితం. ఎవరో అన్న, విన్న మాటల ఆధారంగా ఆరోపణలు చేసే కుసంస్కారిని కాదు. వాస్తవాలన్నిటినీ కాలమే ప్రజల ముందు ఉంచుతుంది. మీ పట్ల నా హృదయంలో గౌరవ స్థానమే ఉంటుంది. మాతృదేవోభవ... అంటూ ట్వీట్ చేశారు. 
 
మరో ప‌క్క లోకేష్ ట్వీట్ల పై ఇప్పుడు ప‌వ‌న్ ఎలా స్పందిస్తారు అని ఆలోచిస్తున్నారు నాయ‌కులు.. ఇటు త‌న దగ్గ‌ర పూర్తి ఆధారాలు ఉన్నాయి అనేలా ప‌వ‌న్ స్టేట్ మెంట్లు ట్విట్ట‌ర్ లో చేస్తున్నారు.. మ‌రి చూడాలి లోకేష్ కామెంట్లు ట్వీట్ల‌పై ప‌వ‌న్ డైరెక్ష‌న్ ఎలా ఉండ‌బోతోందో.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.