ఇది మ‌రో ఉదాహ‌ర‌ణ‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-01 14:18:56

ఇది మ‌రో ఉదాహ‌ర‌ణ‌

వ‌జ్రం వ‌జ్రంతోనే కోయాలి... రాజ‌కీయాల్ని రాజ‌కీయాల‌తోనే స‌మాధానం ఇవ్వాలి... సినిమాని సినిమా ప‌రంగానే చూడాలి ద‌టీజ్ లాబీయింగ్....  ఏపీలో సీఎం చంద్ర‌బాబు నల‌బై సంవ‌త్స‌రాల రాజ‌కీయ అనుభవం  త‌న‌కు ఉంద‌ని దేశంలోనే ఒక్కోసారి ప్రపంచంలోనే ఇంత తెలివి అయిన వారు ఎవ‌రూ లేరు అని అంటారు.. అయితే ఆయ‌న త‌న‌యుడు మంత్రి నారా లోకేష్ కూడా ఆయ‌న బాట‌లోనే న‌డుస్తున్నారు...
 
ఆయ‌నే భావిత‌రాల‌కు ఉదాహ‌ర‌ణ, ఏపీ ఐడ‌ల్ యువ‌త‌కు రోల్ మోడ‌ల్ అంటూ ఏవో చెప్పారు... అయితే  రాజ‌కీయంగా ఎలా ఉన్నా మంత్రి లోకేష్ సినిమా ట‌చ్ కూడా బాగానే ఇస్తున్నారు...  అవును తెలుగుదేశం అంటేనే ఎన్డీఆర్ పెట్టిన పార్టీ... ఎన్టీఆర్ స్ధాపించిన తెలుగు పార్టీ... దీంతో పార్టీ ప‌రంగా చూసినా రాజ‌కీయంగా చూసినా తెలుగుదేశంలో అక్క‌డ‌క్క‌డా సినిమా వాస‌న ఉంటుంది..
 
అంతెందుకు ఎమ్మెల్యే బాల‌య్య ఎన్టీఆర్ వార‌సుడు... అయితే ఈ రాజ‌కీయ సినీ ఉపోద్ఘాతం ప‌క్క‌న పెట్టి అస‌లు విష‌యానికి వ‌స్తే?  మంత్రి నారా లోకేష్ తాజాగా ట్వీటెట్టారు... రంగ‌స్ధ‌లం లాంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమా అందించినందుకు ద‌ర్శ‌కుడు సుకుమార్ కు,హీరో  చ‌ర‌ణ్ కు అభినంద‌న‌లు చెప్పారు... ఆ పాత్ర‌లు ఇంకా త‌మముందే ఉన్నాయి అని అన్నారు.. మెగా ఫ్యామిలీకి ఇటీవ‌ల  నంద‌మూరి ఫ్యామిలీ ప్ర‌శంస‌లు పెరిగాయి.. అయితే నారా ఫ్యామిలీ కూడా ప్ర‌శంస‌లు ఇస్తోంది. అయితే ఈ ప్ర‌శంస‌లు ఎలా ఉన్నా నారా లోకేష్ ప‌వ‌న్ కు ద‌గ్గ‌ర అవ‌డానికి మ‌రో ప్లాన్ వేశారు అని అంటున్నారు నాయ‌కులు.
 
మ‌రీ ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ ట్వీట్ పై మెగా అభిమానులు డిస్ లైక్ లే చేస్తున్నారు... అస‌లు మా ప‌వ‌న్ వెనుక ఇంత కుట్ర చేసిన లోకేష్ ఇప్పుడు ఎవ‌రికి అభినంద‌న‌లు తెలుపుతున్నారు అని అంటున్నారు... మెగా ప‌వ‌ర్  స్టార్ కు ప్ర‌శంస‌లు ఇచ్చినా మీ పార్టీని మీ ఎల్లో కుట్ర‌ను న‌మ్మ‌ము  అంటున్నారు ప‌వ‌న్ అభిమానులు... అయితే ప‌వ‌న్ ఇటీవ‌ల మంత్రి లోకేష్ ఓ రెండు ఛానెళ్లు త‌నపై ప‌దికోట్లు ఖ‌ర్చుచేసి ఎటువంటి కుట్ర చేస్తున్నాయి అనేది బ‌య‌ట‌పెడ్డాడు.. అయితే  ప‌వ‌న్ చేసిన‌ వ్యాఖ్య‌లు తెలుగుదేశంలోనే కాదు రాజ‌కీయంగా ఏపీలో కాక‌పుట్టించాయి.
 
మ‌రీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయ‌కుల చేత ప‌వ‌న్ ని తిట్టిస్తూ ఓ ప‌క్క మంత్రి లోకేష్ వెంట‌నే ఆయింట్ మెంట్ పూస్తున్నారు అని ఇక్క‌డ స్ప‌ష్టంగా తెలుస్తోంది... ఉద‌యం అంతా మంత్రులు - ఎమ్మెల్యేలు ప‌వ‌న్ ని తిడుతుంటారు.. సాయంత్రం ప‌వ‌న్ చాలా మంచివారు ఆయ‌న నాపై చేసిన ఆరోప‌ణ‌లు తాను పట్టించుకోను కాని, త‌న‌పై ఆయ‌న వెనుక ఉండే వారు కొంద‌రు ఆయ‌న్ని ప‌క్క‌దారి ప‌ట్టిస్తున్నారు అంటున్నారు.... అయితే తండ్రి తెలివితేట‌లు బాగానే వ‌చ్చాయ‌ని రాజ‌కీయంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ పై ఎటువంటి కామెంట్లు చేస్తున్నాడో తెలిసిందే... కాపుల‌ను ద‌గ్గ‌ర చేసుకోవ‌డానికి ఇదంతా మంత్రి లోకేష్ ఆడుతున్న కొత్త గేమ్ అంటున్నారు జ‌న‌సేన నాయ‌కులు.

షేర్ :

Comments

1 Comment

  1. జనాలని బకరాలు చేయటంలో సిధ్ధహస్తులు। మరి।

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.