ఆ సెగ్మెంట్లో టీడీపీకి వైసీపీ గ‌ట్టి పోటీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-15 14:59:41

ఆ సెగ్మెంట్లో టీడీపీకి వైసీపీ గ‌ట్టి పోటీ

వైసీపీ,అధికార తెలుగుదేశం పార్టీ రెండు పార్టీలు ఇక్క‌డ సీటు పై త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నాయి అని వార్త‌లు వ‌స్తున్నాయి.. మ‌రోప‌క్క వైసీపీ అభ్య‌ర్దిని న‌ర‌సాపురం సీటు ఫిక్స్ చేసినా, జ‌గ‌న్ ఎటువంటి నిర్ణ‌యం ఇక్క‌డ ప్ర‌క‌టిస్తారా అని అంద‌రూ ఎదురుచూశారు.. ఆయ‌న న‌ర‌సాపురంలో ఎటువంటి ప్ర‌క‌ట‌న అభ్య‌ర్దిపై చేయ‌లేదు.. అలాగే  ఇరు పార్టీల హీటుతో తీర‌ప్రాంతం మ‌రింత హీటెక్కింది.
 
జ‌గ‌న్ పాద‌యాత్ర పూర్తి అయింది ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో.. మ‌రీ ముఖ్యంగా ఇక్క‌డ న‌ర‌సాపురంలో జ‌గ‌న్ కు విశేష స్పంద‌న ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చింది అనే చెప్పాలి.. ఇక ఎవ‌రికి సీటు ఇస్తారు అనే మీమాంశ ఇప్ప‌టికే పార్టీలో నేత‌లు ఆలోచించుకుంటున్నారు..వైసీపీ త‌ర‌పున పోటీ చేసేది ముదునూరి ప్ర‌సాద‌రాజు అని ఇక్క‌డ కేడ‌ర్ కూడా ఫిక్స్ అయింది జ‌గ‌న్ కూడ ఆయ‌న‌కు హామీ ఇచ్చారు.
 
అయితే అధికార తెలుగుదేశం పార్టీలో మాత్రం ఇంకా ఇక్క‌డ లుక‌లుక‌లు త‌గ్గ‌లేదు.. సీనియ‌ర్ నేత అయిన కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడు మాజీ మంత్రిగా ప‌నిచేశారు.. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున ఓట‌మి చెంది తెలుగుదేశం పార్టీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు...ఇటు ప్ర‌స్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు మాధ‌వ‌నాయుడికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు ఇస్తారు అని అంటున్నారు ఇక్క‌డ నేత‌లు... ఇప్పటికే తెలుగుదేశంలో రెండు గ్రూపుల రాజ‌కీయాలు జ‌రుగుతున్నాయి... ఒక‌రి కార్య‌క్ర‌మాల్లో మ‌రొకరు పాల్గొన‌రు. ఇలా ఉంది ఇక్క‌డ తెలుగుదేశం రాజ‌కీయం.
 
అయితే ముదునూరికి సీటు అని ఇంట‌ర్న‌ల్ గా చ‌ర్చ‌లు జ‌రుపుతున్నా, జ‌గ‌న్ అక్క‌డ పాద‌యాత్ర‌లో ఎవ‌రు న‌ర‌సాపురం నుంచి పోటీ చే్తారు అనే పేరు ప్ర‌క‌టించ‌డ‌క‌పోవ‌డం ఇక్క‌డ కేడ‌ర్ ను కూడాఆ నిరుత్సాహ‌ప‌రిచింది.. ఇక్క‌డ మెజార్టీ కాపు, క్ష‌త్రియ ఓటుబ్యాంకుతో పాటు బీసీ ఓటు బ్యాంకు బ‌లంగా ఉండ‌టంంతో, రాజ‌కీయంగా ఎటువంటి నిర్ణ‌యాలు ఈ రెండు పార్టీలు తీసుకుంటాయా అని ఆలోచ‌న‌లో ఉన్నారు నాయ‌కులు.
 
ఇటు జ‌న‌సేనాని ప‌వ‌న్ పార్టీ జ‌న‌సేన‌కు కూడా ఇక్క‌డ బ‌లంగానే అభిమానులు ఉన్నా, యువ‌త‌లోనే ఆయ‌న‌కు కేడ‌ర్ ఉంది.. దీనిని ప్ర‌జాబ‌లంగా మార్చుకోవాలి, ముఖ్యంగా ఇదంతా ప్రేక్ష‌కాభిమానం, అందుకే ఇక్క‌డ కూడా జ‌న‌సేన ఓట్లు చీల్చుతుంది అనే భావ‌న ప‌లువురిలో ఉంది... ఇక్క‌డ జ‌న‌సేన బాధ్య‌త‌ల‌ను  కాంగ్రెస్‌లో కొనసాగిన కలవకొలను తులసీ చూస్తున్నారు... ఇటు జ‌న‌సేన‌లో కూడా బీసీ- కాపు సామాజిక‌వ‌ర్గాల నాయ‌కులు సీట్లకోసం చూస్తున్నారు.. మ‌రో ప్ర‌ముఖ డాక్ట‌ర్ కూడా ఇక్క‌డ సీటు కోసం ఆలోచ‌న చేస్తున్నారు. మ‌రి చూడాలి న‌ర‌సాపురం  రాజ‌కీయం ఎటువంటి మ‌లుపులు తీసుకుని ఎవ‌రి జెండా రెప‌రెప‌లాడిస్తుందో.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.