ఇద్ద‌రు చంద్రుల పై నారాయ‌ణ సంచ‌లన వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

narayana and chandrababu naidu and kcr image
Updated:  2018-03-14 05:21:11

ఇద్ద‌రు చంద్రుల పై నారాయ‌ణ సంచ‌లన వ్యాఖ్య‌లు

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం జ‌రుగుతున్న రాజ‌కీయాల పై వామ‌ప‌క్ష పార్టీ నాయ‌కుడు నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో ఉన్న ప్ర‌జ‌లు ప్ర‌త్యేకహోదా కోసం ఆరాట ప‌డుతుంటే వారిని అర్ధం చేసుకోకుండా పాల‌న చేస్తున్న సీఎం చంద్ర‌బాబు విధానాన్ని  ఆయ‌న ఖండించారు. ఏపీ అభివృద్ది చెంద‌డానికి ప్ర‌త్యేక‌హోదా అతి ముఖ్య‌మైన‌ది, దాని పై టీడీపీ ప్ర‌భుత్వం నిర్ధిష్ట‌మైన ప్ర‌ణాళికతో ముందుకు వెళ్ల‌క‌పోవ‌డాన్ని ఆయ‌న త‌ప్పుబ‌ట్టారు. 
 
ఇటీవ‌ల కేంద్ర మంత్రి వ‌ర్గం నుంచి టీడీపీ బ‌య‌టికి రావ‌డం స‌రైన‌దే అయినా ఇప్ప‌టికీ ఎన్‌డీఏలో కొన‌సాగ‌డాన్ని ఆయ‌న త‌ప్పుబ‌ట్టారు. బీజేపీ విషయంలో రాజకీయ నిర్ణయం తీసుకునేందుకు చంద్రబాబు భయపడుతున్నారని నారాయణ వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసింద‌న్న విష‌యాన్ని చంద్ర‌బాబు తెలుసుకొవ‌డానికి నాలుగేళ్లు ప‌ట్టిందా అని ఎద్దెవా చేశారు.... కేంద్ర ప్ర‌భుత్వం ఏపీకి హోదా ఇవ్వ‌ద‌ని ఆయ‌న అన్నారు... ప్ర‌త్యేక హోదా కోసం రాష్ట్రంలో ఉన్న‌ అన్ని పార్టీల‌ను క‌లుపుకుని పొరాడాల‌ని చంద్ర‌బాబుకు సూచించారు. ఈ స‌మ‌యంలో ప్యాకేజీ ఇచ్చినా ప్ర‌భుత్వం ఖర్చు చేయ‌డానికి సమయం లేదని నారాయణ తెలిపారు.
 
తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలన నిజాం పాలనను తలపిస్తుందని నారాయణ విమర్శించారు.  తాజాగా అసెంబ్లీ నుంచి ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డిని సస్పెండ్‌ చేయడం సరైన‌ది కాద‌ని ఆయ‌న‌ అభిప్రాయపడ్డారు. ప్ర‌జాస్వామ్యంలో ప్రతిపక్షాలు పోరాటం చేయ‌డం ఒక భాగ‌మ‌ని వారిని అణచివేసేందుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నార‌ని ఆయన ఆరోపించారు. ఇటీవల పార్లమెంట్‌, అసెంబ్లీ సమావేశాలు తరచూ వాయిదా పడటం మంచి పరిణామం కాదని ప్ర‌జ‌ల కొసం చ‌ర్చ జ‌ర‌గాల‌ని ఆయ‌న అన్నారు..కేంద్రంలో దుష్ట ప‌రిపాల‌న చేస్తున్న బీజేపీకి వ్య‌తిరేకంగా దేశంలో ఉన్న అన్ని పార్టీల‌ను ఏకం చేస్తున్నామ‌ని అన్నారు. ఏప్రిల్‌ 25 నుంచి 29 వరకు కేరళలో జరిగే సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ అంశాన్ని చర్చిస్తామని  నారాయణ తెలిపారు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.