ఆయ‌న రాక‌ను బాబు అండ్‌ కో..లు వ్య‌తిరేకిస్తారా...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp
Updated:  2018-07-14 04:41:48

ఆయ‌న రాక‌ను బాబు అండ్‌ కో..లు వ్య‌తిరేకిస్తారా...

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు బీజేపీతో విడాకులు తీసుకున్న త‌ర్వాత సుదీర్ఝ‌కాలం త‌ర్వాత  ప్ర‌ధాని మోడీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఒక అధికారిక కార్య‌క్రమానికి విచ్చేయ‌నున్నారు. ఈ నెల 22వ తేదీన శ్రీహ‌రి కోటలో జ‌రిగే షార్ భ‌వ‌న ప్రారంభోత్స‌వానికి మోడీ హాజ‌రుకానున్నారు. అయితే ప్ర‌ధాని రాక సంద‌ర్భంగా ఏపీలో ఆయ‌న‌కు నిర‌స‌న‌లు ఎదురు అవుతాయా, కేంద్రం నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి జ‌రిగిన అన్యాయాన్నితెలియ‌జెప్పేలా త‌మ అసంతృప్తి నిర‌స‌న‌ సెగలు చెప్ప‌గ‌ల ద‌మ్ము టీడీపీ నేత‌ల‌కు ఉందా అనేది చ‌ర్చ‌నీయంశంగా మ‌రుతోంది.
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదా విష‌యంలో కానీ, ప్ర‌త్యేక చేయూతను అందించే విష‌యంలో కానీ కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం శ్ర‌ద్ద‌గా లేద‌న్న సంగ‌తి ఈ ఏడాది బ‌డ్జెట్ స‌మావేశంలో తేలిపోయిన త‌ర్వాత తెలుగుదేశం పార్టీ.. కేంద్రం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి బీజేపీ నాయ‌కులు మీద ఎదురు దాడి చేస్తుంది. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొద‌టి నుంచి విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన ప్ర‌త్యేక హోదా కోసం పోరాడుతూనే ఉంది. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో భార‌తీయ జ‌న‌తా పార్టీకి ప్ర‌తీకూలంగా మారిపోయిన త‌ర్వాతే ప్ర‌ధాని మోడీ ఓ సంద‌ర్భంగా ఏపీలో ప‌ర్య‌టించాల‌ని అనుకున్నారు.
 
కేంద్ర ప్రాజెక్ట్ లు ఏవైనా ప్రారంభోత్స‌వానికి సిద్దంగా ఉంటే వ‌స్తాను అని క‌బురు పంపినా తాను రావాల్సిన అవ‌స‌రం లేద‌న్న‌ట్టుగా బాబు స‌ర్కార్ క‌బుకు పంపింది. ప్ర‌త్యేక హోదా, క‌డ‌ప స్టీల్ ప్లాంట్ సాధ‌న‌కోసం రాష్ట్ర ప్ర‌జ‌లు రాజ‌కీయ నేత‌లు ఉద్య‌మిస్తున్న త‌రుణంలో రాష్ట్రానికి ప్ర‌ధాని మోడీ రాబోతున్నారు. ఆయ‌న చేతులమీదుగా శ్రీహ‌రికోట‌లో షార్ కొత్త భ‌వ‌నానికి ప్రారంభోత్స‌వం జ‌రుగ‌నుంది. 
 
అయితే ఈ సంద‌ర్భంగా తెలుగు ప్ర‌జ‌లు నిర‌స‌న‌ల‌ను మోడీ చ‌విచూడాల్సిన ప‌రిస్థితి వ‌స్తుందా అనే అంశం చ‌ర్చ‌నీయాంశం అయింది. నెల్లూరు జిల్లాలోని సూళ్లూరు పేట ద‌గ్గ‌ర స‌ముద్ర‌తీరంలో శ్రీహ‌రికోట ఉంది. ఈ కార్య‌క్ర‌మాని మోడీ నేరుగా షార్ లో ఉండే హెలిస్పాట్ ద‌గ్గ‌ర దిగుతారు. క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త ఉండే షార్‌లో సాధార‌ణ ప్ర‌జ‌లు నిర‌స‌నలు తెలిపే అవ‌కాశ‌మేలేదు. 
 
అయితే ప్ర‌ధాని వ‌చ్చే స‌మ‌యానికి న‌ల్ల బెలూన్ల‌ను ఎగ‌ర‌వేయ‌డం ద్వారా నిర‌స‌న‌లు తెలిపే ఆస్కారం ఉంది. అయితే ఇందుకు టీడీపీ ధైర్యం చేస్తుందా అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. కొద్ది రోజుల‌క్రితం జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా తిరుమ‌లలో ప‌ర్య‌టించిన స‌మ‌యంలో త‌లెత్తిన వివాదంలో ప్ర‌ధాని రాక‌తో నిర‌స‌న‌లు త‌క్కువే అన్న‌వాద‌న‌లు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు షార్ కార్య‌క్ర‌మానికి  ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు హాజ‌రు అవుతారా లేదా అన్న‌ది కూడా ఇప్ప‌టికీ స్ప‌ష్టం కాలేదు. మోడీ రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌లో నిర‌స‌న‌ల మాట అలా ఉంచితే రాష్ట్ర స‌మ‌స్య‌ల‌పై క‌నీసం విన‌తుల‌ను అయినా చంద్ర‌బాబు వినిపిస్తారో లేదో చూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.