ప్ర‌ధాని మోదీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-06 18:39:59

ప్ర‌ధాని మోదీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోదీ ప్ర‌తిప‌క్షాల పై తీవ్ర‌స్ధాయిలో విరుచుకుప‌డ్డారు... దేశంలో అల‌జ‌డి సృష్టించ‌డానికే ఇటువంటి ప‌నులు ప్ర‌తిప‌క్షాలు చేస్తున్నాయి అని ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు..బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలు విభజన రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఇక మోదీ ఓ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు ఈ స‌మ‌యంలో.
 
పార్లమెంటులో ఏర్పడిన ప్రతిష్టంభనకు నిరసనగా ఈ నెల 12న తమ పార్టీ ఎంపీలు నిరాహార దీక్ష చేస్తారని చెప్పారు. ఈ ప్రతిష్టంభనకు కారణం కాంగ్రెసేని ఘాటుగా విమర్శించారు ఆయ‌న‌... త‌మ పై క‌క్ష‌క‌ట్టార‌ని బీజేపీ పై విమ‌ర్శ‌లు చేయ‌డం కాంగ్రెస్ కు అల‌వాటు అయింది అని బీజేపీ విమ‌ర్శించింది.
 
తమ పార్టీ (బీజేపీ) కలుపుగోలు రాజకీయాలు చేస్తోందని, ప్రతిపక్షాలు మాత్రం విభజన, నకారాత్మక రాజకీయాలు చేస్తున్నాయని ఆయ‌న విమ‌ర్శించారు. ప్రతిపక్షాల తీరుకు కారణం బీజేపీకి బలం పెరుగుతుండటమేనన్నారు. ప్రజల ఆశీర్వాదాలు, కార్యకర్తల కృషి కారణంగానే తమ పార్టీ బలోపేతమవుతోందని చెప్పారు...
 
తమ పార్టీ  అందరితో కలిసి అందరి అభివృద్ధి యాత్రను నిర్వహిస్తుందన్నారు. బీజేపీ అంద‌రి పార్టీ అని తెలియ‌చేశారు.. కావాల‌నే కొంద‌రు ఇటువంటి ప్ర‌క‌ట‌న‌లు అవాస్త‌వాలు చెబుతున్నారు అని ప్ర‌జ‌ల‌కు బీజేపీ పై న‌మ్మకం ఉంది అని విమ‌ర్శించారు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.