ప్ర‌త్యేక హోదాను అడ్డుకుంటుంది టీడీపీనే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-21 11:25:12

ప్ర‌త్యేక హోదాను అడ్డుకుంటుంది టీడీపీనే

రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా కావాలంటూ  ప్ర‌తిప‌క్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు ప‌ట్టు విడువకున్నారు... ఈ నేప‌థ్యంలో కేంద్ర వైఖ‌రిని నిర‌సిస్తూ లోక్ స‌భ‌లో వైసీపీ ఎంపీలు అవిశ్వాస తీర్మానం పెట్టారు... కానీవారు పెట్టిన అవిశ్వాస తీర్మానానికి స‌భ ప్రారంభ‌మైన కొన్ని క్ష‌ణాల్లోనే స‌భ స‌జావుగా జ‌ర‌గ‌లేద‌న్న నేప‌థ్యంతో స్పీక‌ర్ వాయిదావేశారు... మ‌ళ్లీ  తిరిగి రెండ‌వ రోజు స‌భ ప్రారంభ‌మైన 30 సెకండ్ల‌కే స్పీక‌ర్ ముందు ఫ్లకాడ్స్ ప‌ట్టుకుని ప్ర‌తిప‌క్షాలు నిర‌స‌న‌లు చేశారు.
 
అయితే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అనుకూల ఎల్లో మీడియా క‌థ‌నం ప్ర‌కారం... టీడీపీ నాయ‌కులు పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీక‌ర్ ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకముందే టీఆర్ ఎస్‌, అన్నాడీఎంకే ఎంపీలు అడ్డుకున్నార‌ని వారి ఛాన‌ల్స్ లో ప్ర‌చారం చేశాయి... కానీ వాస్త‌వానికి వీరు కాదు అడ్డుకున్న‌ది... స‌భ లో అవిశ్వాస తీర్మానం చ‌ర్చ‌కు వ‌చ్చిన స‌మ‌యంలో స‌భ్యులంతా సైలెంట్ గా ఉండాలి.. అప్పుడే స్పీకర్  తీర్మానానికి మద్దతు ఉందా లేదా అన్నది స్పీకర్ నిర్ణయిస్తారు. 
 
అయితే స‌భ చ‌ర్చ జ‌రగ‌కుండా సాక్షాత్తు తెలుగు దేశం పార్టీ ఎంపీలే  అడ్డుకుంటున్నార‌ని జాతీయ మీడియా త‌మ కెమెరాల‌తో గుర్తించింది...  రెండ‌వ రోజు స‌భ ప్రారంభ‌మైన త‌రుణంలో స్పీక‌ర్ సుమిత్రామ‌హాజ‌న్ ఎంపీలు ప్ర‌వేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం స్వీకరించే స‌మ‌యంలో స్వ‌యానా టీడీపీ ఎంపీలు ఫ్లకాడ్స్ ప‌ట్టుకుని స్పీక‌ర్ కు అడ్డంగా పెట్ట‌డం వంటి దృశ్యాల‌ను జాతీయ మీడియా గుర్తించింది.
 
దీంతో స‌భ చ‌ర్చ‌కు రాకుండా అవిశ్వాసం పెట్టిన టీడీపీ ఎంపీలే అడ్డుకోవ‌డం ఏంటి అని జాతీయ మీడియా చ‌ర్చించుకుంటోంది... అస‌లు ఎంపీలు ఈ డ్రామా ఎందుకు ఆడుతున్నార‌ని ఒక‌ క‌థ‌నంలో పేర్కొంది...అయితే ఈ విష‌యాన్ని తెలుసుకున్న ఎల్లో మీడియా మ‌ళ్లీ ఎలాంటి క‌థ‌ను తెర‌పై ఉంచుతారో అని కొంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.