జాతీయ మీడియా సంచ‌ల‌న క‌థ‌నం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-04 17:49:33

జాతీయ మీడియా సంచ‌ల‌న క‌థ‌నం

సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ఏపీ రాజ‌కీయాలు ఉత్కంటగా కొన‌సాగుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా వ్యూహాలు ర‌చించుకుంటున్నాయి రాజ‌కీయ పార్టీలు....ప్ర‌జ‌ల‌ను మెప్పించ‌డానికి ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తే, అధికార తెలుగుదేశం పార్టీ అభివృద్దే ల‌క్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ ప్ర‌చార‌మే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా ప్ర‌చారం సాగిస్తున్నాయి రాజ‌కీయ పార్టీలు.   
 
ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే ప‌ని ఏది చేసినా కూడా వెంట‌నే పార్టీకు సంబందించిన సోష‌ల్‌మీడియా పేజ్‌లో  పోస్ట్ చేస్తూ ప్ర‌చారం కొన‌సాగిస్తున్నారు. దీంతో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ సోషల్ మీడియా సాధ‌కులు పార్టీల‌కు సంబందించిన ప్ర‌చారం బాగానే చేసుకుంటున్నాయి. తాజాగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఒక‌ ప్రయత్నం చేయ‌గా అది అనూహ్యంగా బెడిసికొట్టింది. 
 
తెలుగుదేశం పార్టీ ఫేస్ బుక్ పేజీలో పెట్టిన ఒపీనియన్ పోల్ లో మొత్తం 15వేల మంది వరకూ పాల్గొన్నారట. ఆ ఒపీనియ‌న్ పోల్‌లో అత్యధికులు కాబోయే సీఎం జగన్ అని అభిప్రాయపడ్డారట. దాన్ని ప‌రిశీలించిన‌ తెలుగుదేశం సోషల్ మీడియా షాక్ గురై వెంట‌నే ఆ ఒపీనియన్ పోల్ ను పేజీ నుంచి తొలగించార‌ట‌.
 
దీన్ని గ‌మ‌నించిన ద‌క్క‌న్ క్రానిక‌ల్ అనే ఆంగ్లప‌త్రిక టీడీపీ నిర్వ‌హించిన ఒపీనియ‌న్ పోల్ పై విశ్లేష‌ణాత్మ‌క‌మైన క‌థ‌నం ప్ర‌చురించింది. వాస్తవానికి ఈ పోల్ మరికొన్ని రోజులు కొనసాగాల్సి ఉంది. తుది ఫలితాల వరకూ వేచి చూసే సాహసం చేయలేని తెలుగుదేశం సోషల్ మీడియా సెల్ దాన్ని క్లోజ్ చేసేసిందని వివ‌రించింది ఆంగ్ల‌ప‌త్రిక‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.