నేష‌న‌ల్ స‌ర్వే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-04 14:59:48

నేష‌న‌ల్ స‌ర్వే

చంద్ర‌బాబు స‌ర్కారు పై ఏపీలో తీవ్ర‌స్దాయిలో దుమారం వ‌స్తోంది... ఏపీకి ప్ర‌త్యేక హూదా సాధించ‌లేక‌పోయారు అలాగే ఏపీకి ఎటువంటి నిధులు కేంద్రం నుంచి తీసుకురావ‌డంలో స‌క్సెస్ కాలేక‌పోయారు... దీంతో ప్ర‌జ‌లు కూడా తెలుగుదేశం పై విమ‌ర్శ‌లు చేయ‌డం, వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌చ్చితంగా ఓట‌మి రుచిచూపిస్తాం అంటున్నారు..
 
అయితే ఇప్పుడు నంద్యాల ఎన్నిక‌లు, కాకినాడ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటి అదే మాకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యానికి ఓ ఆక‌ర్ష మంత్రం అని చెబుతున్నారు తెలుగుదేశం నాయ‌కులు... అయితే ఒక‌టి ఉప ఎన్నిక రెండు అధికార  పార్టీ కాబ‌ట్టి కాకినాడ‌లో అలా విజ‌యం వ‌చ్చింది అనేది దేశం అంతా తెలిసిందే.
 
ఇక ఏపీలో తాజాగా ఓ జాతీయ ఛాన‌ల్ స‌ర్వే  చేప‌ట్టింద‌ట ఈ స‌ర్వేలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో  ఏపీలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి అధికారం అని తేల్చింది...  ఇక యూపీలో కూడా ఈ సంస్ద సర్వే చేప‌ట్టింది... యూపీలో బీజేపీకి అత్య‌ధికంగా సీట్లువ‌స్తాయి అని తెలిపింది... అలాగే జ‌రిగింది.... ఇక ఏపీలో 175 సీట్ల‌కు గాను 120 సీట్లు వైసీపీ గెలుచుకునే అవ‌కాశం ఉంద‌ని ఆ స‌ర్వే తేల్చింది.. ఇక గుంటూరు కృష్ణాలో తెలుగుదేశం ఇప్పుడు గెలిచిన‌ స్ధానాల్లో50  శాతం విజ‌యం సాధిస్తుంద‌ట‌. ఇక జ‌న‌సేన పార్టీ పొత్తులేకుండా పోటీ చేస్తే గోదావ‌రి జిల్లాలో 10 ఉత్త‌రాంధ్రాలో మాత్ర‌మే  సీట్లు గెలుస్తుంది అని స‌ర్వే తెలియ‌చేసింది.
 
ఇక ఏపీలో 175 సీట్ల‌లో 
వైసీపీ 120 సీట్లు 
తెలుగుదేశం 45 సీట్లు
జ‌న‌సేన 10 సీట్లు గెలుస్తుంది అని తెలియచేసింది స‌ర్వే

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.