జ‌గ‌న్ కు జై కొడుతున్న జ‌తీయ పార్టీలు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-24 17:58:43

జ‌గ‌న్ కు జై కొడుతున్న జ‌తీయ పార్టీలు

జాతీయ స్థాయిలో భార‌తీయ జ‌న‌తా పార్టీకి వ్య‌తిరేకంగా ఇత‌ర ప్రాంతీయ‌ పార్టీల‌న్ని జ‌త‌కట్టి బీజేపీని గ‌ద్దె దించాల‌ని చూస్తున్నారు. ఈ క్ర‌మంలో బీజేపీకి వ్య‌తిరేకంగా ఉన్న పార్టీలు కాంగ్రెస్ పార్టీ గూటికి చేరాల‌ని భావిస్తున్నాయి. ఈ కూట‌మికి ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు పాత్ర పోషించాల‌ని చూస్తున్నారు.
 
ఇక మ‌రో వైపు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీల‌కు వ్య‌తిరేకంగా ఫెడ‌ర‌ల్ ను ఏర్పాటు చేశాయాల‌ని చూస్తున్నారు. ఈ ఫెడ‌రల్లో భాగంగానే ముఖ్య‌మంత్రి కేసీఆర్ దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీ ముఖ్య‌మంత్రుల‌ను, ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను క‌లిసి తాను ప్రారంభించ‌బోయే ఫెడ‌ర‌ల్ కు మ‌ద్ద‌తు తెలుపాల‌ని కోరి వ‌చ్చారు కేసీఆర్.
 
కాంగ్రెస్ పార్టీకి దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు మ‌ద్ద‌తు తెలుప‌డంలో కాస్త జంకుతున్నారు. గ‌తంలో చంద్ర‌బాబు నాయుడు అనేక పార్టీల‌తో పొత్తు పెట్టుకుని వాడుకుని వ‌దిలేశార‌ని అయితే ఇప్పుడు తెలిసి తెలిసి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు తాము మ‌ద్ద‌తు ఇవ్వ‌మ‌ని దేశ రాజ‌కీయ నాయ‌కులు చెబుతున్నార‌ట‌. చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు తెలిపే బ‌దులు ప్ర‌తిపక్ష‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తు తెలుప‌డ‌మే మంచిద‌ని భావిస్తున్నార‌ట‌. 
 
గతంలో చంద్ర‌బాబు త‌న స్వార్థ రాజ‌కీయాల‌కోసం  మామ ఎన్ టిఆర్ తో పాటు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు, బావమరిది హరిక్రిష్ణ,ఆయన కుమారుడు జూనియర్ ఎన్ టిఆర్ ల‌ను నిలువునా మోసం చేశార‌ని రాజ‌కీయ‌ నాయ‌కులువాపోతున్నారు. ఇక ఫెడరల్ ఫ్రంట్ నిర్మాతగా వ్యవహరిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కూడా చంద్రబాబు కంటే జగన్ మంచిదని అభిప్రాయ పడుతున్నారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.