వైసీపీ కి అనుకూలంగా జాతీయ సర్వే.. ఇప్పటికిప్పుడు 21 లోక్ సభ సీట్లు...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp
Updated:  2018-10-12 03:15:26

వైసీపీ కి అనుకూలంగా జాతీయ సర్వే.. ఇప్పటికిప్పుడు 21 లోక్ సభ సీట్లు...

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ఓడి పోవడం ఖాయం. ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం. అని  వచ్చిన గత సర్వేల మాదిరిగానే మరో సర్వే జగన్ కు అనుకూలంగా వచ్చింది.. చంద్రబాబును గద్దెదింపి.. 

వైఎస్ జగన్‌ను గద్దెనెక్కించడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని. సీఎం చంద్రబాబు ప్రభుత్వం పనితీరుపై ఏపీ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఈ సర్వే లో స్పష్టంగా బయట పడింది.. అన్ని వర్గాల్లో టీడీపీ సర్కార్‌పై వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తధ్యంగా కనిపిస్తుంది.

ఎన్నికల వేల దేశ ప్రజల మనస్థితి ఎలా ఉంది..? ప్రభుత్వాల తీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు..? ఏఏ అంశాలు ఎన్నికల్లో ప్రాధాన్యం సంతరించుకోబోతున్నాయి..? అయితే సి ఓటర్‌ సంస్థ జరిపిన ఓ సర్వేలో  ఏపీలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రతి పక్షనేత , వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని వైసీపీ పార్టీ ఘన విజయం సాధించనుందని  స్పష్టమైంది. 'నేషనల్‌ అప్రూవల్‌ రేటింగ్స్‌' పేరిట జరిగిన ఈ సర్వే ఫలితాలు గురువారం రిపబ్లిక్‌ టీవీలో ప్రసారమయ్యాయి. ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి ఘోర పరాభవం తప్పదని సెప్టెంబర్‌ నెలలో జరిపిన ఈ సర్వే తేల్చింది.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగి వైసీపీ, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌లు ఎలాంటి పొత్తులూ లేకుండా పోటీలో నిలిస్తే.. మొత్తం 25 లోక్‌సభ స్థానాలకుగాను వైసీపీకి 21 సీట్లు, టీడీపీకి కేవలం నాలుగు సీట్లు వస్తాయని సర్వే తేల్చింది. అటు జాతీయపార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లు ఒక్క స్థానంలో కూడా గెలవలేవంది. ఇక ఓట్ల శాతం పరంగా చూసినా సీ ఓటర్‌ సర్వేలో వైసీపీదే పైచేయిగా కనిపించింది. వైసీపీకి 41.9 శాతం ఓట్లు, టీడీపీకి 31.4 శాతం ఓట్లు పడతాయనీ, 2014తో పోలిస్తే టీడీపీకి 9 శాతానికిపైగా ఓట్లు తగ్గుతాయని సర్వే వెల్లడించింది. దీంతో తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు. వైసీపీ ఫ్యాన్స్ మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.