వైసీపీలోకి మాజీ సీఎం కుటుంబం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-12 12:55:51

వైసీపీలోకి మాజీ సీఎం కుటుంబం

వైసీపీలో మ‌రో మాజీ సీఎం కుటుంబం కూడా చేరే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఆ కుటుంబం ఉభ‌య తెలుగురాష్ట్రాల్లో మంచి పేరు ఉన్న కుటుంబం. నెల్లూరు జిల్లాలో నేదురుమ‌ల్లి జ‌నార్ద‌న్ రెడ్డి గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌నిలేదు సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు ఏపీకి సీఎంగా చేసిన వ్య‌క్తి.ఇక ఆయ‌న నెల్లూరు జిల్లాలో కీల‌క నాయ‌కుడిగా ఎదిగారు ఆయ‌న నెల్లూరు నుంచి సీఎం స్ధానంలో కూర్చున్నారు.
 
ఇక ఆయ‌న కుటుంబంలో ఆయ‌న భార్య నేదురుమ‌ల్లి రాజ్య‌ల‌క్ష్మీ కూడా నాడు వైయ‌స్ కేబినెట్ లో మంత్రిగా చేశారు. ఇక  నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి త్వరలో తాను ఓ పార్టీలోచేరుతున్నాను అని తెలియ‌చేశారు. మ‌రో రెండు మూడునెల‌ల్లో ఓ స్ప‌ష్టత వ‌చ్చే అవ‌కాశం ఉంది అని అన్నారు. ఆయ‌న ప్ర‌క‌ట‌న‌తో ఇప్పుడు రాజ‌కీయంగా అంతా చ‌ర్చించుకుంటున్నారు జిల్లాలో. ఇప్ప‌టికే వేమిరెడ్డి నుంచి ఇటీవ‌ల ఆనం వ‌ర‌కూ వైసీపీ వైపు చూడ‌టం పై తెలుగుదేశం దిగులు పెట్టుకుంది. గ‌త ఎన్నిక‌ల ఫలితాలు మ‌ళ్లీ జిల్లాలో రిపీట్ అవుతాయని తెలుగుదేశం విజ‌యం సాధించ‌దు అని నేత‌లు ఆలోచిస్తున్నారు.
 
ఇక ఆయ‌న త్వ‌ర‌లో త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు ప్ర‌క‌టిస్తా అని చెప్ప‌గానే ఆయ‌న కేడ‌ర్ కార్య‌క‌ర్త‌లు అంద‌రూ కూడా వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలి అని కోర‌డంతో అక్క‌డ ఆయ‌న ఓ చిరున‌వ్వు న‌వ్వారు. ఆన‌వ్వుతో త‌న మ‌న‌సులో విష‌యాన్ని తెలియ‌చేసారు అని అంటున్నారు కార్య‌క‌ర్త‌లు. వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నాయకుడు మేరుగు మురళీధర్‌తో కూడా ఇప్ప‌టికే ఆయ‌న చ‌ర్చ‌లు జ‌రిపారు అని అంటున్నారు.
 
ఇక సీటు పై చ‌ర్చ‌లు ఎలా ఉన్నా పార్టీలో క‌లిసి ప‌నిచేసేందుకు, ఆయ‌న సిద్దం అని తెలియ‌చేశారని  జిల్లా వైసీపీ నాయ‌కులు తెలియ‌చేస్తున్నారు. మొత్తానికి జ‌గ‌న్ వెంట ఉన్న ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి, మేక‌పాటి ఫ్యామిలీ, వేమిరెడ్డి, ఎమ్మెల్యేలు అనిల్, కోటం రెడ్డి, ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి, కాకాని గోవ‌ర్ద‌న్ రెడ్డి ఇలా జ‌గ‌న్ కు అత్యంత స‌న్నిహితులు అంద‌రూ ఈ జిల్లా నుంచి వైయ‌స్ జ‌గ‌న్ వెంట ఉండ‌టం, అలాగే ఆయ‌న‌కు గ‌త ఎన్నిక‌ల్లో వ‌చ్చిన మెజార్టీ కంటే జిల్లాలో మ‌రింత మెజార్టీ వ‌స్తుంది అని, జిల్లా వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుంది అని తెలియ‌చేస్తున్నారు. మొత్తానికి వైసీపీ జిల్లాలో జోరుమీద దూసుకుపోతోంది అని చెప్ప‌వ‌చ్చు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.