జ‌గ‌న్ స‌మ‌క్షంలో నేదురుమ‌ల్లి రాంకుమార్ వైసీపీ తీర్థం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan and nedurumalli ram kumar
Updated:  2018-09-08 11:44:37

జ‌గ‌న్ స‌మ‌క్షంలో నేదురుమ‌ల్లి రాంకుమార్ వైసీపీ తీర్థం

మాజీ ముఖ్య‌మంత్రి కుమారుడు నేదురుమ‌ల్లి రాంకుమార్ ఈరోజు ప్ర‌తిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు. సుమారు 200 వాహనాల‌తో 500వంద‌ల‌మంది కార్య‌క‌ర్త‌ల‌తో విశాఖ జిల్లాలో పాద‌యాత్ర చేస్తున్న వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌ద్ద‌కు చేరుకుని వైసీపీ కండువా క‌ప్పుకున్నారు రాంకుమార్.
 
ఇక పార్టీ తీర్ధం తీసుకున్న త‌ర్వాత ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ జ‌గ‌న్ ప్ర‌క‌టించిన న‌వ‌రత్నాలకు ఆక‌ర్షితులై తాను వైసీపీ తీర్థం తీసుకున్నాని అన్నారు. ప్రజా సంక‌ల్ప‌యాత్ర‌లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నార‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. 
 
పెందుర్తి నియోజ‌క‌వ‌ర్గంలోని జెర్రిపోతుల‌పాలెం నుంచి శ‌నివారం ఉద‌యం ప్రారంభం అయిన ఈ సంక‌ల్ప‌పాయాత్ర  కోట‌న‌ర‌వ హ‌నుమాన్ ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకోగానే రామ్ కుమార్, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిస‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు. అక్క‌డి నుంచి ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం కొత్త‌పాలెం వ‌ర‌కు ఈరోజు పాద‌యాత్ర కొన‌సాగుతుంద‌ని వైసీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయి రెడ్డి స్ప‌ష్టం చేశారు. అంతేకాదు ఈరోజు చేయ‌బోయే పాద‌యాత్ర అపూర్వ ఘ‌ట్టంగా మిగిలిపోతుంద‌ని అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశామ‌ని ఆయ‌న తెలిపారు.