జ‌గ‌న్ రాక‌కోసం ఎదురు చూస్తున్న‌ ఇద్ద‌రు నాయ‌కులు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-09 17:49:51

జ‌గ‌న్ రాక‌కోసం ఎదురు చూస్తున్న‌ ఇద్ద‌రు నాయ‌కులు

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా వైసీపీ అధికారంలోకి  వ‌స్తుంద‌ని, వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  ముఖ్య‌మంత్రి కావ‌డం ఖాయం అని భావించి  టీడీపీ నాయ‌కుల‌తో పాటు ఇత‌ర‌ పార్టీలకు చెందిన కీల‌క నాయ‌కులు వైసీపీ తీర్థం తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఇదే క్ర‌మంలో మాజీ ముఖ్య‌మంత్రి నేదురుమ‌ల్లి జ‌నార్ద‌న్ రెడ్డి త‌న‌యుడు నేదురుమ‌ల్లి రామ్‌కుమార్ రెడ్డి కూడా వైసీపీ తీర్థం తీసుకునేందుకు రెడీ అయ్యారు. 
 
ఈ మేర‌కు ఆయ‌న నెల్లూరు జిల్లాలోని త‌న నివాసంలో కీల‌క అనుచ‌రుల‌తో స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశంలో త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ కార్య‌చ‌ర‌ణ పై త‌న నిర్ణ‌యం కంటే అనుచ‌రుల మాట ప్ర‌కార‌మే న‌డుచుకుంటాన‌ని తెలిపారు. ఇక ఈ విష‌యంపై తీవ్రంగా ఆలోచించిన రామ్‌కుమార్ రెడ్డి అనుచ‌రులు ప్ర‌తిపక్ష‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాల‌ని ఆయ‌న‌కు సూచించారు. త‌న అనుచ‌రుల కోరిక‌ మేర‌కు అతి త్వ‌ర‌లో రామ్‌కుమార్ రెడ్డి వైసీపీ తీర్ధం తీసుకోనున్నారు. అంతేకాదు ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో ఆయ‌న వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డిని క‌లిసి వ‌చ్చారు. ఆ త‌ర్వాత త‌న అనుచ‌రుల‌తో ఆత్మీయ స‌మ్మేళ‌నం ఏర్పాటు చేశారు.
 
ఇక మ‌రోవైపు ఇదే జిల్లా నుంచి ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి కూడా వైసీపీలో చేరేందుకు సిద్ద‌మ‌య్యారు. పాద‌యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్ వైజాగ్ లో అడుగు పెట్ట‌గానే ఆయ‌న వైసీపీ తీర్థం తీసుకునేందుకు సిద్ద‌మ‌య్యారు. ఒకే జిల్లాకు చెందిన ఇద్ద‌రు కీల‌క నాయ‌కులు వైసీపీ తీర్థం తీసుకుంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో నెల్లూరులో వైసీపీ మ‌రింత బ‌ల‌ప‌డుతుంద‌ని పార్టీ నాయ‌కులు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.