ఆ జిల్లానుంచి వైసీపీలోకి భారీ చేరిక‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-06 16:59:57

ఆ జిల్లానుంచి వైసీపీలోకి భారీ చేరిక‌లు

దేశ రాజకీయాల్లో రాయ‌ల‌సీమ రాజ‌కీయం అంటే ఒక ప్ర‌త్యేకమైన గుర్తింపు ఉంది. ఈ ప్రాంతంలో గ్రామ స్థాయి స‌ర్పంచ్ నుంచి రాష్ట్ర ప‌తి ప‌ద‌వుల వ‌ర‌కు అనుభ‌వంచిన నాయ‌కులు ఉన్నారు. అందుకే రాయ‌ల‌సీమ రాజ‌కీయం అంటే పుట్టుక‌తో వ‌చ్చిన పుట్టు మ‌చ్చ‌లాంటిది... అది చ‌ర‌గ‌దు మ‌నిషి చ‌చ్చేదాక అలాగే ఉంటుంది.
 
అయితే ప్ర‌స్తుతం రాయ‌ల‌సీమ రాజ‌కీయాల‌కు స‌మానంగా నెల్లూరు జిల్లా రాజ‌కీయాలు కూడా చేరాయి. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఈ జిల్లాలో వైసీపీకే ఎక్కువ సీట్లు వ‌చ్చాయి. దీంతో 2019 ఎల‌క్ష‌న్స్ లో త‌న ప‌ట్టు సాధించాల‌ని అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు స‌రికొత్త వ్యూహాలు ర‌చిస్తున్నారు. కానీ వారి వ్యూహాలు మాత్రం ఆశించద‌గ్గ‌విగా క‌నిపించ‌డంలేదు.
 
నాలుగు సంవ‌త్స‌రాల నుంచి అధికార టీడీపీ నాయ‌కులు నెల్లూరు జిల్లాలో తామంటే తాము హైలెట్ అని నిరూపించుకునేందుకు పార్టీలో ఉన్న‌నాయ‌కులను చిన్న చూపు చూస్తూ స‌భాముఖంగా త‌న తోటి నాయ‌కుడిపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇక మ‌రి కొంద‌రు అయితే త‌మ‌కు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నాలుగు సంవ‌త్స‌రాలుగా త‌గిన గుర్తింపు ఇవ్వ‌డంలేద‌ని చెప్పి పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. 
 
ఇక పోయినంత కాలం పార్టీలో ఇలాగే ఉంటే ఫ్యూచ‌ర్ లో త‌న రాజ‌కీయం దెబ్బ‌తింటుంద‌నే భావంతో ఉన్నప‌ళంగా ఇత‌ర పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు. అయితే అందులో ఆనం ఫ్యామిలీ ముందంజ‌లో ఉంది. త‌న సోద‌రుడు మ‌ర‌ణించిన‌ప్ప‌టి నుంచి ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి టీడీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. త‌న‌కు పార్టీ ప‌రంగా త‌గిన గుర్తింపు ఇవ్వ‌డంలేద‌నే ఉద్దేశంతో మ‌రికొద్ది రోజుల్లో వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సమ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకోనున్నారు.
 
ఇక ఆయ‌నతో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన మ‌రో కీల‌క రాజ‌కీయ నాయ‌కుడు కూడా త్వ‌ర‌లో వైసీపీ తీర్థం తీసుకోనున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మాజీ ముఖ్య‌మంత్రి త‌న‌యుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకోవ‌డం ఖాయం అనిపిస్తోంది. వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఆయ‌న త్వ‌ర‌లో బీజేపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరేందుకు సిద్ద‌మ‌వుతున్నారు. ఆయ‌న కానీ పార్టీలో చేరితే వెంక‌ట‌గిరిలో వైసీపీ పార్టీ మ‌రింత‌ బ‌లం చేకూరుతుంద‌ని చెప్పాలి.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.