వెంక‌ట‌గిరి నుంచి పోటీ చేస్తా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-08 16:11:52

వెంక‌ట‌గిరి నుంచి పోటీ చేస్తా

వ‌చ్చే ఎన్నిక‌ల కోసం ఇప్ప‌టి నుంచే ఏపీలో ఇరు రాజ‌కీయ పార్టీలు పొలిటిక‌ల్ స్ట్రాట‌జీలు వేస్తున్నాయి... ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ మాత్రం త‌మ ఉనికిని ప్ర‌శ్నించుకుంటున్నాయి..ఇక రాజ‌కీయంగా బీజేపీతో రాజ‌కీయ‌పార్టీల‌కే కాదు ప్ర‌జ‌ల‌కు కూడా ద్వేషం వ‌చ్చింది, ప్ర‌త్యేక హూదా విష‌యంలో.. ఏపీకి అన్యాయం చేసిన బీజేపీ పై ఎటువంటి సాఫ్ట్ కార్న్ ప్ర‌జ‌ల‌కు లేదు.. ఇక ఏపీకి చంద్ర‌బాబు లేదా జ‌గ‌న్ ప్ర‌త్యేక హూదా తీసుకువ‌స్తారా లేదా అనే ఆలోచ‌న‌లో కూడా ప్ర‌జ‌లు ఉన్నారు.
 
అయితే నెల్లూరు జిల్లాలో మ‌రో కీల‌క నాయ‌కుడు ఈ స‌మ‌యంలో ఓ కీల‌క ప్ర‌క‌టన చేశారు..వ‌చ్చే ఎన్నిక‌ల్లో వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలుస్తానని ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కాంగ్రెస్‌ నేత నేదురుమల్లి జనార్దన్‌ రెడ్డి కుమారుడు నేదురుమల్లి రాం కుమార్‌ రెడ్డి తెలియ‌చేశారు.
 
అయితే తండ్రి పొలిటిక‌ల్ గా రాష్ట్రంలో సీఎం అయ్యారు, ఆయ‌న కుమారుడు మాత్రం రాజ‌కీయాల్లో రాణించ‌లేక‌పోయారు అనే చెప్పాలి.. గ‌తంలో  పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడనే కారణంతో కాంగ్రెస్‌ పార్టీ రామ్‌ కుమార్‌ను సస్పెండ్‌ చేసింది.. దీంతో ఆయ‌న సీనియర్‌ బీజేపీ నాయకుడు,ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి సమక్షంలో బీజేపీలో చేరారు.
 
అయితే బీజేపీలో కూడా ఆయ‌న నాయ‌కుడిగా మాత్ర‌మే కొన‌సాగుతున్నారు. ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో ఆయ‌న బీజేపీలో చ‌క్రం తిప్పే స్ధాయికి చేర‌లేక‌పోయారు.. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను ఎమ్మెల్యేగా వెంక‌ట‌గిరి నుంచి పోటీ చేస్తా అయితే అది బీజేపీ త‌ర‌పున కాదు అని, తాను రెండు నెల‌ల్లో ఓ పార్టీలోచేరుతా అని తెలియ‌చేశారు...
 
ఆగ‌స్టులో కొత్త పార్టీలో ఆయ‌న చేరిక ఉంటుంది అని తెలియ‌చేశారు... అయితే వెంక‌ట‌గిరిలో  ఇటు తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు ఇటు వైసీపీ త‌ర‌పున ఇద్ద‌రు నాయ‌కులు లిస్టులో ఉన్నారు.. అందులో ఆనం సోద‌రుడు కూడా వెంక‌ట‌గిరి సీటు కోరుతున్నారు. ఇటు జ‌న‌సేన‌లో ఆయ‌న చేరే అవ‌కాశం ఉంది అని అంటున్నారు కొందరు నాయ‌కులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.