ఇద్ద‌రు కీల‌క నేతలు వైసీపీలోకి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-05 18:31:28

ఇద్ద‌రు కీల‌క నేతలు వైసీపీలోకి

నెల్లూరు జిల్లాలో వైసీపీకి గ‌త ఎన్నిక‌ల్లో బంప‌ర్ మెజార్టీ వ‌చ్చింది.. ప‌లు సెగ్మెంట్ల‌లో తెలుగుదేశానికి కోలుకోలేని విధంగా వ్య‌తిరేక ఓట్లు ప‌డ్డాయి నెల్లూరులో వైసీపీ ఇప్ప‌టికి దూసుకుపోతోంది అనే చెప్పాలి.మ‌రీ ముఖ్యంగా ఇక్క‌డ  వైసీపీ ఎమ్మెల్యేలు మ‌రింత పార్టీ ప‌టిష్టంగా త‌యారు చేస్తున్నారు.
 
ఇటు తెలుగుదేశంలో సీనియర్లు ఉన్నా, ఎమ్మెల్సీ అవ‌కాశాలు ఇచ్చి మంత్రులుగా వారికి ఛాన్స్ ఇచ్చి నారాయ‌ణ‌, సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డిల‌ను కేబినెట్లో కూర్చొబెట్టుకున్నారు సీఎం చంద్ర‌బాబు.ఇక ఎమ్మెల్యేగా ప‌లుమార్లు ప్రజా తీర్పులో ఓడిపోయిన సోమిరెడ్డి చంద్రమోహ‌న్ రెడ్డికి ఎలా మంత్రి ప‌దవి  ఇస్తారు అని ప్ర‌జ‌లు నెల్లూరులో నాయ‌కులు తెలుగుదేశంలో ఫైర్ అయిన విష‌యం తెలిసిందే..
 
ఇటు వైసీపీలో వేమిరెడ్డి చేరిక‌తో తెలుగుదేశం మ‌రింత డీలా ప‌డింది.. రాజ్య‌స‌భకు  కూడా ఇటు విజ‌య‌సాయిరెడ్డి వేమిరెడ్డి జిల్లా నుంచి ఉండ‌టం ఇటు మేక‌పాటి ఫ్యామిలీ జిల్లాలో రాజ‌కీయ చ‌క్రం తిప్ప‌డం తెలుగుదేశానికి కాస్త చెమ‌ట‌లు ప‌ట్టించే అంశాలు.. అలాగే కాకాని గోవ‌ర్ధ‌న్ రెడ్డి కీల‌క నాయ‌కుడిగా, స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యేగా సోమిరెడ్డికి ఎదురు ఉండ‌టం, ఇటు ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి, అలాగే ఎమ్మెల్యేలు అనిల్, కోటం రెడ్డి శ్రీథ‌ర్ రెడ్డి పార్టీని మ‌రింత ముందుకు తీసుకు వెళుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో తెలుగుదేశం ఇక్క‌డ ప‌రాజ‌యం పాలు అవ‌డంతో ఫిరాయింపుల‌కు జై కొట్టింది.  ఇక్క‌డ ఫిరాయింపులు చేసినా  వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ నేత‌లు గెలిచే ప‌రిస్దితి క‌నిపించ‌డం లేదు.
 
ఇక తాజాగా నేదురుమ‌ల్లి వార‌సుడు చేసిన ఓ కీల‌క ప్ర‌క‌టన వైసీపీలో కొత్త జోష్ తీసుకువ‌చ్చింది.. ఆయ‌న వైసీపీలో చేరే అవ‌కాశం ఉంది అని ఇప్ప‌టికే జిల్లా నాయ‌కులు చర్చించుకుంటున్నారు. ఈ స‌మ‌యంలో మ‌రో ఫ్యామిలీ కూడా వైసీపీ తీర్దం పుచ్చుకోనుంది అని తెలుస్తోంది. వారు కూడా నేదురుమ‌ల్లి కుటుంబానికి అత్యంత స‌న్నిహితులు రాజ‌కీయ ప్రాముఖ్యులు.. వారే మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మి, ఆమె భర్త కృష్ణయ్య వారు కూడా వైసీపీలో చేరే అవ‌కాశం ఉంది అని తాజాగా నెల్లూరులో నయా వార్త‌లు వినిపిస్తున్నాయి.
 
ఇక సీట్ల పై కూడా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి అని తెలుస్తోంది.. ఇటు పార్టీలో ఆ ఫ్యామిలీ చేరితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో నెల్లూరు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేయ‌డం ఖాయం అని అంటున్నారు నాయ‌కులు, జిల్లా వైసీపీ శ్రేణులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.