విజ‌య‌సాయిరెడ్డితో రాయ‌బారం స‌క్సెస్...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

vijaya sai reddy
Updated:  2018-10-05 11:13:29

విజ‌య‌సాయిరెడ్డితో రాయ‌బారం స‌క్సెస్...

ఏపీ రాజ‌కీయాల్లో నెల్లూరు జిల్లాకు ప్ర‌త్యేకమైన స్థానం ఉంది. ఈ జిల్లాలో అధికార ప్ర‌తిప‌క్షాలు నువ్వా నేనా అన్న‌ట్లు ప్ర‌తీసారి పోటీ ప‌డుతుంటారు. అంతేకాదు ఈ రోజు ఒక్క పార్టీలో ఉండే నేత‌లు రేపు మ‌రో పార్టీలో క‌నిపిస్తుంటారు. ఇలాంటి నెల్లూరు జిల్లాలో 2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో సీట్ల‌ స‌ర్థుబాటు వ్య‌హారంలో నేత‌లు బిజీబీజీగా ఉన్నారు.
 
త‌మ‌కు సీటు ఇవ్వ‌క‌పోతే పార్టీ మారేందుకు కూడా సిద్ద‌ప‌డుతున్నారు జిల్లా నాయ‌కులు. ఈ జిల్లాలో గూడూరు నియోజ‌క‌వ‌ర్గానికి ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ అభ్య‌ర్థి సునీల్ కుమార్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయ‌న ఎమ్మెల్యే అయిన కొద్దినెల‌ల‌కే అధికార ప్ర‌లోభాల‌కు ఆశ‌ప‌డి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుకున్నారు. అయితే సునీల్ రాక‌ను టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన జ్యోత్న్సల‌త వ్య‌తిరేకించారు. 
 
అయిన‌ప్ప‌టికీ పార్టీ అధిష్టానం నిర్ణ‌యాల‌తో కొన్నిరోజులు క‌లిసి ప‌ని చేశారు. ఇక నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుత‌న్న ప‌లు అభివృద్ది కార్య‌క్ర‌మాలు పార్టీ అధికారిక కార్య‌క్ర‌మాల‌తో పాటు ఇత‌ర‌త్ర విష‌యాల్లో సునీల్ ప్రాధాన్య‌త ఇవ్వ‌డం లేదంటూ పార్టీ జిల్లా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారుజ్యోత్న్సల‌త. ఇక ఇద్ద‌రి మ‌ధ్య స‌ఖ్య‌త కోసం ప‌లు సంద‌ర్భాల్లో పార్టీనేత‌లు స‌మావేశాలు నిర్వాహించినా పరిస్థితి మార‌లేదు.
 
ఇక ఈ క్ర‌మంలో ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో ఈసారి గూడూరులో టీడీపీ సీటు ఎవ‌రికి కేటాయిస్తార‌నే వాద‌న తెర‌పైకి వ‌చ్చింది. జ్యోష్న్సల‌త మత్రం త‌న‌కు సీటు కావాల‌ని అధిష్టానంపై ఒత్తిడి తీసుకువ‌చ్చారు. అయితే ఇదే క్ర‌మంలో మంత్రి నారాలోకేశ్ ను క‌లిసి నియోజ‌క‌వ‌ర్గ ప‌రిస్థితుల‌ను వివ‌రించిన‌ట్లు స‌మాచారం. అయితే సీటు విష‌యంలో ఆముకు ఎలాంటి హామీ లేపోవ‌డంతో ఆమె త్వ‌ర‌లో వైసీపీ గూటికి చేరుతున్న‌ట్లు స‌మాచారం. 
 
ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన జ్యోత్న్స ల‌త వైశ్య వ‌ర్గానికి చెందిన నాగ‌రాజు అనే వ్యాపార వేత్త‌ను వివాహం చేసుకోవ‌డంతో రెండు వైపుల బ‌లం ఉంద‌నేది ఈమె న‌మ్మ‌కం. దీంతో ఎలాగైనా వ‌చ్చే ఎన్నిక‌ల్లో గూడూరు గెల‌వాల‌నే అమె భావిస్తున్నారు. టీడీపీపీలో టికెట్ అభించ‌ద‌నే ఉద్దేశంతో నెల రోజుల క్రితం డిల్లీకి వెళ్లి అక్క‌డ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డిని జ్యోత్న్స దంప‌తులు క‌లుసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇక ఇదే క్ర‌మంలో మాజీ ముఖ్య‌మంత్రి కుమారుడు నెదురుమ‌ల్లి రాం కుమార్ రెడ్డి కూడా జ్యోత్న్సల‌త విష‌యాన్ని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ద‌గ్గ‌ర‌క వివ‌రించ‌డంతో ఆయ‌న కూడా సానుకూలంగా స్పందించార‌ట‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.