ఇది జ‌లీల్ ఖాన్ ని మించిన డైలాగ్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-18 13:57:24

ఇది జ‌లీల్ ఖాన్ ని మించిన డైలాగ్

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తిలో గ్రామ వికాసం కార్య‌క్ర‌మంలో పాల్గొని ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాము గ‌త ఎన్నిక‌ల‌ మేనిఫెస్టోలో ఉన్న అంశాలు అన్ని నాలుగు సంవ‌త్స‌రాల‌లో పూర్తి చేశామ‌ని అన్నారు. అయితే గ్రామ వికాసం కేవ‌లం 20 శాతం మాత్ర‌మే గ్రామాల్లో జ‌రిపామ‌ని వ‌చ్చే డిసెంబ‌ర్ లోపు అన్ని గ్రామాల వార్డుల్లో తిరిగి పూర్తి చేయాల‌ని ఆయ‌న సూచించారు. 
 
ఈ గ్రామ వికాసం కార్య‌క్ర‌మంలో ప్ర‌తీ ఒక్క ప్రజా ప్ర‌తినిధులు పాల్గొని ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చెయ్యాల‌ని చంద్ర‌బాబు సూచించారు. వారానికి మూడు రోజులు చొప్పున చేప‌ట్టే ఈ కార్య‌క్ర‌మం డిసెంబ‌ర్ లో పూర్తి అయ్యే లోపు కేవ‌లం 60 రోజులు మాత్ర‌మే ఉంద‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. అందుకోసం ప్ర‌జా ప్ర‌తినిధులంద‌రు క‌లిసి ప్ర‌తీ గ్రామాల్లో వార్డుల్లో తిరిగి ప్ర‌జ‌ల‌ను చైత‌న్య ప‌ర‌చాల‌ని స్ప‌ష్టం చేశారు. టీడీపీ నాలుగేళ్లు అధికారంలో ఉంది ఈ నాలుగేళ్ల‌లో మ‌నం చేసిన అభివృద్ది కార్య‌క్ర‌మాల‌న్ని టీడీపీ ఆధీనంలోనే జ‌రిగాయ‌ని చెప్పాల‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నాయ‌కుల‌కు సూచించారు. 
 
ఇక ఈ వార్త‌ను చూసిన ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు సోష‌ల్ మీడియాను వేదిక‌గా చే