వేటుకు రంగం సిద్దం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-13 10:50:42

వేటుకు రంగం సిద్దం

క‌ర్నూలు పార్లమెంట్ స‌భ్యురాలు బుట్టా రేణుక  కొత్త చిక్కులు తెచ్చుకున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఆమె ఇటీవ‌ల అధికార తెలుగుదేశం పార్టీకి మ‌ద్ద‌తు ప‌లికారు. ఎంపీ అవ‌డంచేత టెక్నిక‌ల్ స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌నే ముంద‌స్తు వ్యూహంతో  టీడీపీ కండువాను క‌ప్పుకోలేదు. కండువా క‌ప్పుకోక‌పోయినా బుట్టా రేణుక మాత్రం ఫిరాయింపు ఎంపీ.
 
అయితే రేణుక ఎంపీగా ఉంటూనే కేంద్ర శిశు సంక్షేమ శాఖ పరిధిలోని కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు (సీఎస్‌డబ్ల్యూబీ) జనరల్ బాడీ సభ్యురాలిగా కూడా కొనసాగుతున్నారు. లాభ‌దాయ‌క‌మైన ప‌ద‌విలో కొసాగుతున్నందున ఆమెపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పార్ల‌మెంట‌రీ స్ధాయి సంఘం సిఫార‌సు చేసింది. 
 
కాని బుట్టా రేణుక మాత్రం తనను కేంద్ర  ప్రభుత్వమే బోర్డులో నియమించిందని, అందులో జీత భత్యాలు కూడా ఉండవని ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. అయితే ఇప్పుడు బుట్టా రేణుక‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోనున్నార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.