ఏపీ, టీఎస్ రాష్ట్రాల్లో ఉద్యోగాల నోటిఫికేష‌న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ap,telangana jobs notifications
Updated:  2018-04-23 05:17:42

ఏపీ, టీఎస్ రాష్ట్రాల్లో ఉద్యోగాల నోటిఫికేష‌న్

ఎన్నో సంవ‌త్స‌రాలుగా తెలుగు రాష్ట్రాలు విడిపోయిన స‌మ‌యం నుంచి నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు.. ఇరు రాష్ట్రాల్లో పోలీసు శాఖ ఉద్యోగాలు తీసినా మిగిలిన శాఖ‌లు ఉద్యోగాల భ‌ర్తీ చేయ‌డం లేదు అయితే తాజాగా వ‌చ్చిన నోటిఫికేష‌న్ తో కాస్త హుషారుగా ఉన్నారు నిరుద్యోగులు..స‌ర్కారు  ఉద్యోగాల కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లి  కోచింగ్ తీసుకుంటున్నవిద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది.ఓ సారి విడుద‌లైన ఉద్యోగాల వివ‌రాలు?
 
ఏపీ సీఆర్‌డీఏ, విజయవాడ
* సంస్థ: ఆంధ్రప్రదేశ్‌ క్యాపిటల్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఏపీ సీఆర్‌డీఏ). 
* పోస్టులు: టీమ్‌ లీడర్‌, రిమోట్‌ సెన్సింగ్‌ అసిస్టెంట్‌ తదితర కాంట్రాక్టు పోస్టులు. 
* ఖాళీలు: 10 వర్క్‌ లొకేషన్‌: విజయవాడ. 
* అర్హత: సంబంధిత బ్రాంచుల్లో ఎంఈ/ ఎంటెక్‌/ బీఈ/ బీటెక్‌, అనుభవం. 
* ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా. 
* ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: 06.05.2018 
వెబ్‌సైట్‌: https://crda.ap.gov.in/
 
బీఈఎంఎల్‌ లిమిటెడ్‌లో 140 బ్యాక్‌లాగ్‌ పోస్టులు
* సంస్థ: బీఈఎంఎల్‌ లిమిటెడ్‌ (భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌ లిమిటెడ్‌), బెంగళూరు. 
* పోస్టులు: గ్రూప్‌ ఎ, బి, సి బ్యాక్‌లాగ్‌ (ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ పీడబ్ల్యూడీ). 
* ఖాళీలు: 140 
* అర్హత, అనుభవం, వయసు: బీఈఎంఎల్‌ నిబంధనల ప్రకారం. 
* ఎంపిక: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా. 
* దరఖాస్తు: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌. 
* దరఖాస్తు ఫీజు: రూ.500 
* ఆన్‌లైన్‌ దరఖాస్తు: 23.04.2018 నుంచి 07.05.2018 వరకు. 
* హార్డ్‌ కాపీలను పంపడానికి చివరితేది: 14.05.2018 
వెబ్‌సైట్‌: http://www.bemlindia.in/
 
ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో ఎయిర్‌మెన్‌
* పోస్టు: స్పోర్ట్స్‌ కోటాలో ఎయిర్‌మెన్‌ (గ్రూప్‌ వై ట్రేడ్‌). 
* అర్హత: 10+2 ఉత్తీర్ణతతోపాటు సంబంధిత క్రీడాంశాల్లో జూనియర్‌/ సీనియర్‌ విభాగాల్లో అంతర్జాతీయ, జాతీయ స్థాయుల్లో పాల్గొని ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు తప్పనిసరి. అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. 
* వయసు: 1997 జులై 1 నుంచి 2001 జూన్‌ 27 మధ్య జన్మించి ఉండాలి. 
* ఎంపిక: సెలక్షన్‌ ట్రయల్స్‌ (ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌, స్పోర్ట్స్‌ స్కిల్‌ ట్రయల్స్‌), మెడికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌ ఆధారంగా. 
* దరఖాస్తు: ఆఫ్‌లైన్‌. 
* చివరితేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌ (ఏప్రిల్‌ 21-27)లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోపు. 
వెబ్‌సైట్‌: http://indianairforce.nic.in/
 
కేంద్రీయ విద్యాలయ, గచ్చిబౌలి  
* పోస్టులు: పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ, ఒకేషనల్‌ ఇన్‌స్ట్రక్టర్‌ తదితర టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ (కాంట్రాక్టు). 
* అర్హత, వయసు: స్కూలు నిబంధనల ప్రకారం. 
* ఎంపిక: స్క్రీనింగ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ద్వారా. 
* ఇంటర్వ్యూ తేది: 2018 ఏప్రిల్‌ 29, 30 
* వేదిక: కేంద్రీయ విద్యాలయ, గచ్చిబౌలి, హైదరాబాద్‌. 
వెబ్‌సైట్‌:http://www.kvgachibowli.edu.in/
 
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాలు  
* కోర్సు: ఇంటర్‌ మొదటి ఏడాది 
* ప్రవేశాలు కల్పించనున్న కళాశాలలు: సాంఘిక/ గిరిజన సంక్షేమ గురుకులాలు 
* గ్రూపులు: ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, వృత్తి విద్యా కోర్సులు 
* బోధనా మాధ్యమం: ఇంగ్లిష్‌ 
* అర్హత: తెలంగాణకు చెందిన 2018 పదోతరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు 
* ఎంపిక: గురుకుల్‌ జూనియర్‌ కాలేజ్‌ సెట్‌ ద్వారా. 
* ప్రవేశపరీక్ష తేది: 28.05.2018 
* దరఖాస్తు ఫీజు: రూ.100 
* ఆన్‌లైన్‌ దరఖాస్తు: 23.04.2018 నుంచి 07.05.2018 వరకు. 
వెబ్‌సైట్‌: http://tswreis.in/

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.