టీడీపీ ఎమ్మెల్యేల‌తో చంద్ర‌బాబుకు కొత్త స‌మ‌స్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-26 15:07:40

టీడీపీ ఎమ్మెల్యేల‌తో చంద్ర‌బాబుకు కొత్త స‌మ‌స్య‌లు

2019 సార్వత్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో రాజ‌కీయ నాయ‌కుల్లో పండుగ వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతోంది. పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశం, ప్ర‌తీ ప్రాంతానికి వెళ్లి ప్ర‌చారం చేయ‌డం. ఇలాంటి ప‌నుల్లో ఆయా పార్టీ నాయ‌కులు ఫుల్ బిజీగా ఉంటారు. ఇక మ‌రి కొంద‌రు అయితే త‌మ‌కు అధిష్టానం టికెట్ ఇస్తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో స‌త్తా చాటాల‌నే ఉద్దేశ్యంతో రాజ‌కీయ నాయ‌కులు భావిస్తుంటారు. ఇలా ప్ర‌తీ ఒక్క‌రు ఒక్కొ కోణంలో ఆలోచిస్తుంటారు. ఇక వీట‌న్నంటిని ప‌క్క‌న పెడితే పార్టీ అధిష్టానం కేవ‌లం ప్ర‌జాధ‌ర‌ణ ఉన్న వ్య‌క్తికి మాత్రమే టికెట్ కేటాయిస్తోంది.
 
అయితే ఇలాంటి విష‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు తీవ్రంగా ఆలో చిస్తున్నారు. 2014 లో టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యాప్తంగా దందాలు వ‌సూళ్లు, దౌర్జ‌న్యాలు ఎక్కువ‌గా చేశారు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో వీరిని టీడీపీ త‌ర‌పున పోటీ చేయిస్తే ఖ‌చ్చితంగా పార్టీ దెబ్బతింటుంద‌నే ఉద్దేశ్యంతో ప్ర‌స్తుత ఎమ్మెల్యేల స్థానంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కొత్త‌వారిని బ‌రిలో దించేందుకు చూస్తున్నారు.
 
కొత్త వారిని బ‌రిలో దించితే తాను సేఫ్ అవుతాన‌నే ఉద్దేశ్యంతో ఆయ‌న ఇలాంటి ప్లాన్లు  వేస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. వ్య‌తిరేకంగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేల‌ను వేరే నియోజ‌క‌వ‌ర్గంలో చంద్ర‌బాబు పోటీ చేయించేందుకు సిద్ద‌మ‌య్యార‌ని వార్త‌లు వస్తున్నాయి. అయితే ఈ విష‌యంపై సుమారు ఆరుగురు ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ నియోజ‌క‌వ‌ర్గంలో అభ్య‌ర్థుల‌ను చంద్ర‌బాబు మార్చేందుకు ప్ర‌య‌త్నిస్తే టీడీపీ పై రెబ‌ల్ గా అయినా బ‌రిలోకి దిగి వారిని ఓడించేందు ప్ర‌య‌త్నిస్తామ‌ని టీడీపీ ఎమ్మెల్యేలు భ‌హిరంగంగానే చెబుతున్నారు. 
 
మొత్తానికి చంద్ర‌బాబు నాయుడు పార్టీ కోసం ఏ విధంగా ఆలోచించినా కూడా వ్య‌తిరేకంగా మారుతోంది. చూడాలి ఎన్నిక‌ల‌కు కేవ‌లం ప‌ది మాసాలు మాత్ర‌మే గ‌డువు ఉంది. ఈలోపు టీడీపీలో ఏవిధంగా మార్ప‌లు చోటు చేసుకుంటాయే అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారుతోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.