చింత‌మ‌నేనికి చిక్కులు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-08 16:19:36

చింత‌మ‌నేనికి చిక్కులు

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఎంట‌ర్ అయిన స‌మ‌యంలో, అంద‌రి చూపు దెందులూరు పైనే ఉంది... ఇటు చింత‌మ‌నేని కి అడ్డుక‌ట్ట వేసేలా అటు అబ్బ‌య్యచౌద‌రి త‌న రాజ‌కీయ పందా చూపుతారని అంద‌రూ ఎదురుచూశారు..
 
అయితే ఇక్క‌డ జిల్లాలో ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌రిగిన స‌భ‌ల్లో భారీగా జ‌నం త‌ర‌లివ‌చ్చింది భీమ‌వ‌రం ఆకివీడు ఉండి స‌భ‌ల‌కు అదే విధంగా దెందులూరుకు... ఇటు జ‌గ‌న్ పాద‌యాత్ర స‌మ‌యంలో చింత‌మ‌నేని చాక్లెట్టు పంచుతూ అక్క‌డ అంద‌రి ముందు క‌నిపించినా, అక్క‌డ జ‌గ‌న్ పాద‌యాత్ర‌ని మీడియా నుంచి డైవ‌ర్ట్ చేయ‌డానికే అని ఓ ట్రోల్ కూడా చింత‌మ‌నేని పై స్టార్ట్ అయింది..
 
ఇటు పాద‌యాత్ర‌కు జ‌నం అశేషంగా త‌ర‌లిరావ‌డం చూసిన తెలుగుదేశం నాయ‌కులు ఒక్క‌సారిగా కంగుతిన్నారు. ముఖ్యంగా పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ కు దెందులూరు ప్ర‌జ‌లు విశేషంగా త‌ర‌లివ‌చ్చారు.. మండ‌లాల నుంచి పెద్ద సంఖ్య‌లో జ‌నం ఈ స‌భ‌కు త‌ర‌లివ‌చ్చారు..
 
అయితే ఇటు వైసీపీ చేయించుకున్నఇంట‌ర్న‌ల్ స‌ర్వే అదే విధంగా పాద‌యాత్ర ముగిసిన త‌ర్వాత దెందులూరులో ప్ర‌జా మ‌ద్ద‌తు ఎలా ఉంది అనేది తెలుసుకుంది.. ఇటు అధికారపార్టీలో ఉన్న చింత‌మ‌నేని పై అనేక మంది విమ‌ర్శ‌లు చేశారు, మ‌రీ ముఖ్యంగా వివాదాల‌తో ఆయ‌న ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్నారు అని, సీఎం ఆయ‌న పై ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదు అనే వ్యాఖ్య‌లు ఆరోప‌ణ‌లు ఎక్కువ మంది నుంచి వినిపించాయి.
 
ఇక తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్య‌ర్దిగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు అవ‌కాశం కూడా ఇవ్వ‌క‌పోవ‌చ్చు అని కూడా కొంద‌రు కొత్త ప్ర‌శ్న లెవ‌నెత్తారు.. గ‌తంలో మంత్రి ప‌ద‌వి రాలేద‌ని అల‌క‌బూనిని  చింత‌మ‌నేనిని, సీఎం అంత ఆశామాషిగా వ‌దిలిపెట్ట‌ర‌ని గ‌తం దీనికి ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకోవ‌చ్చు అని అంటున్నారు, దెందులూరులో ఇటు మాగంటి ఫ్యామిలీ నుంచి ఎవ‌రైనా పోటికి దిగే అవ‌కాశం ఉండ‌వ‌చ్చు అని అంటున్నారు.
 
ఇటు జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో చింత‌మ‌నేనిపై ఇంత వ్య‌తిరేక‌త ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చింది అని ఇప్ప‌టికే తెలుగుదేశం డ్యాష్ బోర్డుకు స‌మాచారం అందింది ఇవ‌న్నీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటుపై ప్ర‌తికూల ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంది అని అంటున్నారు నాయ‌కులు. ఇక అబ్బ‌య్య చౌద‌రి కూడా విద్యావంతుడు సౌమ్యుడు కావ‌డం, కొత్త ఎమ్మెల్యేగా అవ్వాలి అని, రాజ‌కీయ ఓన‌మాలు వైసీపీలో దిద్దుకోవ‌డం, జ‌గ‌న్ కు అత్యంత స‌న్నిహితంగా ఉండ‌టం ఆయ‌న‌కు ప్ల‌స్ అవుతాయ‌ని అంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.