ఏపీలో కొత్త స‌ర్వే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-02 16:03:13

ఏపీలో కొత్త స‌ర్వే

ఏపీలో ఓ స‌ర్వే ఇప్పుడు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది రాజ‌కీయ పార్టీల‌కు.. మ‌రీ ముఖ్యంగా తెలుగుదేశం- వైసీపీ- జ‌న‌సేన పార్టీలు ఈ స‌ర్వే పై ఆలోచ‌న‌లు స‌మాలోచ‌న‌లు చేస్తున్నాయి.. ఇటు బీజేపీ కూడా ఇంట‌ర్న‌ల్ చ‌ర్చ‌లు జ‌రుపుతోంది నాయ‌కుల‌తో... అంత బ్ర‌హ్మాండం బద్ద‌ల‌య్యే వాస్త‌వాలు, నిజాలు, స‌త్య‌వాక్కులు ఏమి ఉన్నాయి అని అనుకుంటున్నారా ఓ సారి ఆ స‌ర్వే వివ‌రాలు తెలుసుకుందాం.
 
తెలుగుదేశం స‌ర్వేల‌కు పెట్టింది పేరు... ఎప్ప‌టిక‌ప్పుడు ఐటీని వాడుకోవ‌డంలో మాకు మేమే తోపులము అని చెప్పుకునే తెలుగుదేశం, ఇంట‌ర్న‌ల్ స‌ర్వేలు కూడా నెల‌నెల చేయిస్తుంది... ఇది చంద్ర‌బాబు స‌ర్వే అని అంద‌రికి తెలిసిందే ...ఆసర్వేల గ్రాఫు బ‌ట్టి సీఎం చంద్ర‌బాబు ఎమ్మెల్యేల‌కు, మంత్రుల‌కు ర్యాంకులు ఇస్తారు.. ప్ర‌సంశ‌లు విమ‌ర్శ‌లు కూడా దాని మూలంగానే వ‌స్తాయి..
 
అయితే ఇప్పుడు ఏపీలో ఓ స‌ర్వే తెలియ‌చేసేది ఏమిటి అంటే?ఇటు జ‌గ‌న్ పాద‌యాత్ర ఏపీలో ఎటువంటి ఒర‌వ‌డిని తీసుకురానుంది? అలాగే  ప్ర‌త్యేక హోదా ఉద్య‌మంలో జ‌గ‌న్ తీసుకున్న స్టాండ్ క‌రెక్టా, లేక చంద్ర‌బాబు స్టాండ్ క‌రెక్టా అని స‌ర్వే ప‌ల్స్ తెలుసుకుంది అని తెలుస్తోంది.
 
అయితే 11 జిల్లాలో మెజార్టీ ప్ర‌జ‌లు ప్ర‌త్యేక‌హోదా పై జ‌గ‌న్ స్టాండ్ క‌రెక్ట్ అంటే,  2 జిల్లాలు తెలుగుదేశం నిర్ణ‌యం క‌రెక్ట్ అని అన్నాయి అని తెలుస్తోంది.. ఇటు 128 అసెంబ్లీ సెగ్మెంట్ల‌లో జ‌గ‌న్ నిర్ణ‌యం క‌రెక్ట్ అంటే ఇటు 40 సెగ్మెంట్ల‌లో తెలుగుదేశం స్టాండ్ క‌రెక్ట్ అని తెలియ‌చేశార‌ట‌. మ‌రో 7 సెగ్మెంట్ల‌లో ప్ర‌త్యేక హోదా పై ఇరువురు కుమ్మక్కు అయ్యారు అని విమ‌ర్శ‌లు చేశారు ప్ర‌జ‌లు.
 
 
ముఖ్య‌మైన అంశం తెలుగుదేశం ముందు నుంచి ప్ర‌త్యేకహోదా అని చెప్పి ఉంటే, ఇప్పుడు ఇటువంటి ప‌రిస్దితి పార్టీకి వ‌చ్చేది కాదు అని ఉత్త‌రాంధ్రాలో ప్ర‌జ‌లు మెజార్టీగా తెలియ‌చేశారు.. ఇక జ‌గ‌న్ పాద‌యాత్ర పూర్తి అయ్యేస‌రికి మ‌రింత మెజార్టీ జ‌గ‌న్ కు వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి అని చెప్పార‌ట‌ ప్ర‌జ‌లు.. ఇక పోల‌వ‌రం పై 48 శాతం ప్ర‌జ‌లు మాత్ర‌మే 2019 కిపూర్తి అవుతుంది అని తెలియ‌చేశార‌ట, ఇది తెలుగుదేశానికి వైసీపీకి అటు బీజేపీకి కాస్త కాక‌పుట్టిస్తున్న స‌ర్వే అని చ‌ర్చించుకుంటున్నారు విశ్లేష‌కులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.