ఏపీలో మ‌రో కొత్త ప‌థ‌కం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-15 11:58:54

ఏపీలో మ‌రో కొత్త ప‌థ‌కం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం  మ‌రో ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టేందుకు సిద్ద‌మైంది. జూన్ రెండో తేదీన 200 అన్న క్యాంటిన్లు ను ప్రారంభించ‌నున్న‌ట్లు  పుర‌పాల‌క శాఖ మంత్రి పి.నారాయ‌ణ తెలిపారు. మొద‌టి విడ‌త‌గా ల‌క్ష జ‌నాభా పైబ‌డి ఉన్న 33 మున్సిపాలిటీల్లో ఈ క్యాంటీన్ల‌ను ప్రారంభించ‌నున్నారు. 
 
ఈ త‌ర‌హాలో క్యాంటీన్లు తెలంగాణ‌, త‌మిళ‌నాడు, కర్ణాట‌క లో అమలు అవుతున్నాయి. క్యాంటీన్ల నిర్వ‌హ‌ణ‌కు ఏపీ ప్ర‌భుత్వం  సొంత భ‌వనాల‌ను నిర్మించ‌నుంది. క్యాంటీన్ల ఏర్పాటు నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి ఇప్ప‌టికే ప్ర‌ణాళిక‌లు సిద్దం చేసుకున్నామ‌ని, ప‌క్క రాష్ట్రాల్లో అమ‌లు అవుతున్న క్యాంటీన్ల ప‌నితీరును స్వ‌యంగా ప‌రిశీలించామ‌ని మంత్రి నారాయ‌ణ తెలిపారు. 
 
ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న క్ర‌మంలో గ‌తంలో ఇచ్చిన హామీల‌ను అమలు చేసేందుకు టీడీపీ స‌ర్కార్ సిద్ద‌మైంది. నిరుద్యోగుల‌కు ఇచ్చిన నిరుద్యోగ భృతిపై కూడా ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక‌లు సిద్దం చేసుకుంది. అయితే భృతి ప‌థ‌కాన్ని ఎప్ప‌టి నుండి అమలు చేయ‌నున్నార‌నే దానిపై ప్ర‌భుత్వం ఇంకా క్లారిటీ ఇవ్వ‌లేదు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.