చిత్తూరులో సంచ‌ల‌నం రేపుతున్న‌ కొత్త స‌ర్వే డైల‌మాలో చంద్ర‌బాబు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-26 15:09:46

చిత్తూరులో సంచ‌ల‌నం రేపుతున్న‌ కొత్త స‌ర్వే డైల‌మాలో చంద్ర‌బాబు

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న నేప‌థ్యంలో ఇటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీపై ప్ర‌జ‌ల అభిప్రాయాన్ని తెలుసుకునేందు స‌ర్వే నిర్వ‌హిస్తున్నారు. అయితే ఈ స‌ర్వేలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు దిమ్మ తిరిగే షాక్ లు త‌గులుతున్నాయి.
 
ప్ర‌ధానంగా 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్ర‌చారంలో చంద్ర‌బాబు నాయుడు టీడీపీ అధికాంలోకి వ‌స్తే రైతుల‌కు రుణ‌మాఫి, డ్వాక్రా రుణ‌మాఫీ అలాగే నిరుద్యోగుల‌కు ఉద్యోగ అవ‌కాశాలు, అమ‌రావ‌తి నిర్మాణం వంటి క్లిష్ట‌మైన హామీల‌ను ప్ర‌క‌టించి అధికారంలోకి వ‌చ్చారు. అయితే అధికారంలోకి వ‌చ్చి నాలుగు సంవ‌త్స‌రాలు పూర్తి అయినా ఇంత‌వ‌ర‌కూ ఒక్క హామీను కూడా అమ‌లు చేయ‌లేదు. దీంతో చంద్ర‌బాబుపై ప్ర‌జ‌లు ఎంతో అసంతృప్తితో ఉన్నారు. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే ప్ర‌జ‌లు త‌మ ఓటుతో టీడీపీకి త‌గిన బుద్ది చెప్పేందుకు ఎంతో ఆశ‌గా ఎదురు చూస్తున్నార‌ని ఈ స‌ర్వేలు తెలిపింది
 
అయితే ఇదే క్ర‌మంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లాలో ఓ సంస్థ‌కు చెందిన వారు చిత్తూరు జిల్లాలో కూడా స‌ర్వేను నిర్వ‌హించారు. ఈ జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్ల‌మెంట్ స్థానాలు ఉన్నాయి. అయితే గ‌డిచిన ఎన్నిక‌ల్లో 14 అసెంబ్లీ స్థానాలు గాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎనిమిది స్థానాలు సొంతం చేసుకుంది. 
 
ఇక మిగిలిన ఆరు స్థానాల‌ను టీడీపీ కైవ‌సం చేసుకుంది. స్వయనా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు జిల్లాలో టీడీపీ నెగ్గ‌క‌పోవ‌డం గ‌తంలో ఆయ‌న మ‌స్థాపానికి గురి అయ్యార‌నే వార్త‌లు వ‌చ్చాయి. దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హయాంలో కూడా చంద్ర‌బాబు త‌న సొంత జిల్లాలో టీడీపీ ప‌ట్టు సాధించ‌లేక పోయారు. ఇక తెలుగు రాష్ట్రాల విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత ఎన్నిక‌లు జరిగ‌తే ఆ ఎన్నిక‌ల్లో కూడా గతంలో వ‌చ్చిన ఫ‌లితాలే వ‌చ్చాయి.
 
ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా ఇంత కంటే ఘోరాతి ఘోర‌మైన ఫ‌లితాల‌ను టీడీపీ ఎదురు చూడ‌బోతుంద‌ని ఈ స‌ర్వేలో తెలిపింది. 14 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ సుమారు 11 అసెంబ్లీ స్థానాల‌ను గెలుచుకునే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఈ స‌ర్వే తెలిపించి. అలాగే టీడీపీ కేవ‌లం మూడు సీట్ల‌కు మాత్ర‌మే ప‌రిమితం అవుతుంద‌ని చెప్పింది. ఇక లోక్ స‌భ‌స్థానాలు రెండు కూడా వైసీపీనే కైవ‌సం చేసుకుంటుంద‌ని ఈ సర్వేలో తేలింది. ఇక ఈ స‌ర్వేలో టీడీపీ నాయ‌కుల్లో కొత్త టెన్ష‌న్ మొద‌లైంద‌నే చెప్పాలి. చూద్దాం చంద్ర‌బాబు నాయుడు ఏం చేస్తారో.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.