చెన్నంపల్లి తవ్వకాల్లో కొత్త ట్విస్ట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-16 05:38:14

చెన్నంపల్లి తవ్వకాల్లో కొత్త ట్విస్ట్

కర్నూలు జిల్లా తుగ్గిలి మండల పరిధిలోని చెన్నంపల్లి కోటలో ప్ర‌భుత్వం అధికారికంగా చేప‌ట్టిన తవ్వకాల్లో మ‌రో  ట్విస్ట్  వెలుగులోకి వ‌చ్చింది. గుప్త నిధుల కోసం ప్ర‌భుత్వం జ‌రుపుతున్న ఈ త‌వ్వ‌కాల్లో పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. ఈ విష‌యం తెలుసుకున్న‌ సంబంధిత అధికారులు వాటిని ప‌రిశీలించి రాముడు, సీత, లక్ష్మణుడి విగ్ర‌హాలుగా గుర్తించారు.
 
గత కొంత కాలంగా త‌వ్వ‌కాలు జ‌రిపిస్తున్న ప్ర‌భుత్వానికి మొద‌ట్లో దంతాలు, పుర్రెలు బ‌య‌ట‌ప‌డిన విష‌యం తెలిసిందే. అప్ప‌టికి కూడా త‌వ్వ‌కాలు నిలిపి వేయ‌కుండా నిరంత‌రాయంగా త‌వ్వ‌కాలు కొన‌సాగించ‌డంచేత పూర్వ‌పు విగ్ర‌హాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. గతేడాది  చివర్లో  మొద‌లుపెట్టిన ఈ త‌వ్వ‌కాలు కొంత కాలం జ‌రిపిన ప్ర‌భుత్వం కొన్ని కార‌ణాల చేత  నిలిపి వేసింది. తిరిగి ఇటీవ‌ల ప్రారంభించిన త‌వ్వ‌కాల్లో  ఈ విగ్ర‌హాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.