రాజ్య‌స‌భ సీటులో కొత్త ట్విస్ట్...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-26 03:48:31

రాజ్య‌స‌భ సీటులో కొత్త ట్విస్ట్...

లోక్ స‌త్తా వ్య‌వ‌స్ధాప‌కులు జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ‌కు రాజ్య‌స‌భ సీటు ఆఫ‌ర్ పై మ‌రో కొత్త ట్విస్ట్ తెర‌పైకి  వ‌చ్చింది. రాజ్య‌స‌భ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఇప్ప‌టికే షెడ్యూల్ రిలీజ్ అయింది. ఏపీలో మూడు స్ధానాల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నారు.
 
ఈ క్ర‌మంలో ఏపీలో తెలుగుదేశం పార్టీ త‌ర‌పున జేపికి అవ‌కాశం ఇవ్వ‌నున్నార‌నే వార్త‌లు పెద్ద ఎత్తున వ‌చ్చాయి. కేంద్ర నిధుల కేటాయింపుకు సంబంధించి నిజానిజాలు తెలుసుకునేందుకు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ ఏర్పాటు చేసిన జేఎఫ్ సీలో జేపి కీల‌క పాత్ర పోషిస్తున్నారు. 
 
దీంతో ప్ర‌స్తుతం నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో జేపికి రాజ్య‌స‌భ సీటు ఇస్తున్నార‌నే వార్త‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఈ వ్య‌వ‌హారానికి సంబంధించి ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హిస్తున్నార‌నే వార్త కూడా ఉంది. 
 
జేపీ, చంద్రబాబుల‌కు మ‌ధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న‌ప్ప‌టికీ, జేపీ ఎక్క‌డా కూడా టీడీపీ సానుభూతి ప‌రుడిగా ముద్ర‌వేసుకోలేదు. ప‌వ‌న్ సిఫార‌సు ద్వారా  జేపికి రాజ్య‌స‌భ సీటు ఇచ్చి జ‌న‌సేన పార్టీకి ప్రాధాన్య‌త ఇచ్చామ‌నే మార్క్ ను కొట్టేయ‌నున్నారు చంద్ర‌బాబు.
 
అయితే రాజ్య‌స‌భ సీటు ఆఫర్ పై జేపీ ఎటూ తేల్చుకోలేని ప‌రిస్ధితిలో ఉన్నార‌ట‌. స్వ‌తంత్య్ర‌ అభ్య‌ర్ధిగా పోటీ చేసి అధికార పార్టీ మ‌ద్ద‌తు తీసుకుంటే ఎలా ఉంటుంద‌నే కోణంలో కూడా ఆలోచిస్తున్న‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ-టీడీపీతో జ‌న‌సేన పొత్తు పెట్టుకోక‌పోతే  ప‌వ‌న్ తో క‌లిసి న‌డిచే దిశ‌గా కూడా జేపీ ఆలోచ‌న‌లు చేస్తున్న‌ట్లు స‌మాచారం. అంతిమంగా రాజ్య‌స‌భ సీటు విష‌యంలో జేపి ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌నే దానిపై ప్ర‌స్తుతం స‌స్పెన్స్ కొన‌సాగుతోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.