ల‌గ‌డ‌పాటి రీ ఎంట్రీలో కొత్త ట్విస్ట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-18 01:17:05

ల‌గ‌డ‌పాటి రీ ఎంట్రీలో కొత్త ట్విస్ట్

త‌న  స‌ర్వేల‌తో ఆంధ్రా ఆక్టోప‌స్ గా పేరు సంపాదించుకున్న కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ పొలిటికల్  రీ ఎంట్రీ షురూ అయిన‌ట్లు తెలుస్తోంది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ అనంత‌రం  ఇచ్చిన మాట ప్ర‌కారం రాజ‌కీయ స‌న్యాసం తీసుకున్న ల‌గ‌డ‌పాటి.....అభిమానులు, కార్య‌క‌ర్త‌ల కోరిక మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకోనున్నారు. 
 
ఇటీవ‌ల ల‌గ‌డ‌పాటి పుట్టిన రోజు వేడుక సంద‌ర్భంగా ఆయ‌న అనుచ‌రులు రాజ‌కీయాల్లోకి రావాల‌ని పెద్ద ఎత్తు ఒత్తిడి తీసుకువ‌చ్చారు. ఇటీవ‌ల ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ను క‌ల‌వ‌డంతో ల‌గ‌డ‌పాటి టీడీపీలోకి ఎంట్రీ ఇస్తార‌నే వార్త‌లు అప్పుట్లో హ‌ల్ చ‌ల్ చేశాయి.
 
అయితే ఇప్పుడు మ‌రో ట్విస్ట్  తెర‌పైకి వ‌చ్చింది. ల‌గ‌డ‌పాటి పుట్టిన రోజు సంద‌ర్భంగా విజ‌య‌వాడ‌లో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయ‌డం గ‌మ‌నార్హం.దీంతో ఆయ‌న జ‌న‌సేన పార్టీలోకి వెళ‌తార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. 
 
ఇప్పుడున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ- టీడీపీ పొత్తు ఉండ‌ద‌నే విష‌యం అంద‌రికీ అర్ధ‌మైంది. ఈ క్ర‌మంలో  టీడీపీ-జ‌న‌సేన కూట‌మి తెర‌పైకి వ‌చ్చే అవ‌కాశాలు  ఎక్కువ‌గా ఉన్నాయి. దీంతో  ల‌గ‌డ‌పాటి జ‌న‌సేన త‌ర‌పున ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ద‌మ‌వుతున్నారంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. ఇందులో నిజ‌మెంత అనేది తెలియాలంటే ల‌గ‌డ‌పాటి అధికారికంగా  ప్రెస్ మీట్ పెట్టాల్సిందే. 
                                       
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.