ఆ జిల్లాలో పోటీ చేస్తారట..

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

comedian aadi
Updated:  2018-10-24 01:54:00

ఆ జిల్లాలో పోటీ చేస్తారట..

సినీ గ్లామ‌ర్ కాస్త రాజ‌కీయ గ్లామ‌ర్ గా మారుతోందా అంటే అవుననే స‌మాధానం క‌నిపిస్తోంది ప్ర‌స్తుత పరిణామాలను చూస్తుంటే. 2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో ఒక్కొక్క‌రు బ‌య‌ట‌కు వ‌చ్చి రాజ‌కీయ అరంగేట్రం చేస్తున్నారు. అంతేకాదు ఆయా పార్టీల్లో చేరిన వీరు అధిష్టానం ఆదేశిస్తే 2019లో పార్టీ త‌ర‌పున పోటీ చేస్తామ‌ని అంటున్నార‌ట‌. అయితే ఇదే క్ర‌మంలో సోషల్ మీడియాలో మ‌రో వార్త వైర‌ల్ అవుతోంది.
 
తెలుగు ఛాన‌ల్స్ లో రారాజు అయిన‌టు వంటి ఓ ప్ర‌ముఖ ఛాన‌ల్‌ లో ప్ర‌సారం అయ్యే జ‌బర్ద‌స్త్ షో ద్వారా ప‌రిచ‌యం అయిన హైప‌ర్ ఆది వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ త‌ర‌పున నెల్లూరు జిల్లాలో పోటీ చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయ ఉనికిని చాటేందుకు ఎక్క‌డ స‌భ‌లను ఏర్పాటు చేస్తే ఆ స‌భ‌ల్లో చురుకుగా పాల్గొంటుంటారు ఆది. 
 
అంతేకాదు ఇటీవ‌లే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆధ్వ‌ర్యంలో జ‌న‌సైనికులు ఉభ‌య‌గోదావ‌రి జిల్లా ధ‌వ‌ళేశ్వ‌రం వద్ద క‌వాతు నిర్మిస్తే అందులో పాల్గొని పరోక్షంగా అధికార నాయ‌కులను విమ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. ఇక ఆయ‌న చురుకుత‌నం చూసి ప‌వ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు నెల్లూరు జిల్లాలో జ‌న‌సేన త‌ర‌పున పోటీ చేయిస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి త‌న‌పై వ‌స్తున్న వార్త‌ల‌పై హైపర్ ఆది స్పందిస్తారా లేదా అనేది ప్ర‌శ్న‌గా మారింది.

షేర్ :