నెక్స్ట్ ఐటీ దాడులకు చంద్రబాబే టార్గెట్టా..

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu
Updated:  2018-10-10 02:14:38

నెక్స్ట్ ఐటీ దాడులకు చంద్రబాబే టార్గెట్టా..

ఏపీలో ఐటీ దాడుల విషయం రోజు రోజుకు ముదురుతోంది..  రాష్ట్రం మీద కుట్ర‌లో భాగంగానే ఈ దాడులు  అంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఈడీ రంగంలో దిగింద‌నే ప్ర‌చారం ఊపందుకుంది. ముఖ్యంగా చంద్ర‌బాబు స‌న్నిహితుడు, మాజీ సీబీఐ డైరెక్ట‌ర్ విజ‌య‌రామారావు త‌న‌యుడి పై క‌న్నేసిన ఈడీ వెనుక పెద్ద క‌థే ఉండ‌వ‌చ్చ‌న్న చ‌ర్చ మొద‌ల‌య్యింది. ఏపీలో ప‌లువురు ముఖ్యుల వ్య‌వ‌హారం విజ‌య‌రామారావు త‌న‌యుడు శ్రీనివాస క‌ళ్యాణ‌రావుతో ముడిపడి ఉంద‌నే ప్ర‌చారం సాగుతోంది. ఇప్పటికే శ్రీనివాస కళ్యాణరావుపై సీబీఐ కేసు నమోదు అయ్యింది.

ప‌లు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన కేసుల్లో ఆయ‌న నిందితుడిగా ఉన్నారు. బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఎండీ గా ఉన్న సమయంలో కళ్యాణరావు బ్యాంకుల కన్సార్టియం నుంచి మొత్తం 304 కోట్ల రూపాయల రుణం తీసుకుని ఎగ్గొట్టార‌ని చెబుతున్నారు. దాంతో ఈ కేసు విచార‌ణ‌లో భాగంగా ఈడీ తెర‌మీద‌కు వ‌చ్చింది. ప‌లు చోట్ల త‌నిఖీలు చేసింది.

అయితే ఈ వ్య‌వ‌హారం తాజాగా జ‌రిగిన ఐటీ దాడుల‌కు కొన‌సాగింపుగానే క‌నిపిస్తున్నాయ‌ని కొంద‌రు వ్యాఖ్యా నిస్తున్నారు. ముఖ్యంగా ఏపీకి చెందిన మాజీ కేంద్ర మంత్రి సుజ‌నాచౌద‌రి కూడా గ‌తంలో బ్యాంకురుణాల ఎగ‌వేత ఆరోపణలు ఎదుర్కొన్నారు. దాంతో శ్రీనివాస క‌ళ్యాణ‌రావు క‌థ మ‌రింత ముందుకు సాగే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు. అదే జ‌రిగితే ఇత‌రుల వ్య‌వ‌హారాల్లో కూడా ద‌ర్యాప్తు సంస్థ‌లు వేలు పెట్టే ప‌రిస్థితి వ‌స్తే టీడీపీ నేత‌ల‌కు పెద్ద త‌ల‌నొప్పి త‌ప్ప‌ద‌ని, దానిని గ్ర‌హించ‌డంతోనే ముందస్తుగా క‌ల‌వ‌ర‌ప‌డుతున్న‌ట్టు క‌నిపిస్తున్నార‌ని అంచ‌నా వేస్తున్నారు.

అయితే ఏపీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల‌కు, తెలంగాణాకు చెందిన తెరాస నాయకుడు మాజీ మంత్రి విజ‌య‌ రామారావు కుటుంబ వ్య‌వ‌హారాల‌కు ముడిపెట్ట‌డం ప‌ట్ల కొంద‌రు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తూనే వ‌రుస‌గా సాగుతున్న ప‌రిణామాల వెనుక ఎక్క‌డో ఓ కీల‌క‌మైన ముడి ఉంటుంద‌న‌డంలో సందేహం లేద‌ని చెబుతున్నారు. అయితే ఆయన చంద్రబాబు సన్నిహితుడు ఒకప్పుడని తర్వాత తెదేపా కష్టాల్లో ఉన్నా వదిలేసి తెరాస లో చేరారని, అటువంటి నాయకుడు చంద్రబాబు కి సన్నిహితుడు ఎలా అవుతాడని, ఊరికే బోడి గుండు కి మోకాలి ముడి పెట్టొద్దని తెదేపా శ్రేణులు నిప్పులు చెరుగుతున్నారు. ఇదిలా ఉంటె ఏది ఏమ‌యినా ఈ ప‌రిణామాలు చివ‌ర‌కు ఎక్క‌డ‌కు దారితీస్తాయో చూడాలి. ఆవు వ్యాసంలా ఎక్కడ మొదలు పెట్టిన అది ఆంధ్ర ప్రదేశ్ ని ఇబ్బంది పెట్టటానికి అన్నట్టు సాగటం విశేషం.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.