చంద్ర‌బాబుకు షాక్ టీడీపీకి రాజీనామా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-29 16:42:13

చంద్ర‌బాబుకు షాక్ టీడీపీకి రాజీనామా

మాజీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ వ్య‌స్థాప‌కుడు నంద‌మూరి తార‌క రామారావు హయాం నుంచి టీడీపీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కొంద‌రు టీడీపీ సీనియ‌ర్ నాయుకులు ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు రాజ‌కీయాలు న‌చ్చ‌క చాలాకాలంగా వారు దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. ఇక అయితే ఈ మ‌ధ్య కాలంలో ఎన్టీఆర్  వీరాభిమాని అయిన తెలంగాణ టీడీపీ నాయ‌కులు మోత్కుప‌ల్లి కూడా పార్టీకి రాజీనామా చేసి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.
 
ఇక తాజాగా టీడీపీ అధికార ప్ర‌తినిధి నిమ్మ‌గ‌డ్డ సీత కూడా పార్టీ కి రాజీనామా చేశారు. తాను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌వ‌ర్త‌న‌ను చూసి పార్టీకి రాజీనామా చేశాన‌ని స్ప‌ష్టం చేశారు. రాజీనామా చేసిన త‌ర్వాత ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో జ‌రుగుతున్న పరిస్థితులను అలాగే పార్టీలో చోటు చేసుకుంటున్న లోటుపాట్ల‌ను గ‌తంలో తాను చంద్ర‌బాబును క‌లిసి స్వ‌యానా వివ‌రించినా, అంతే కాదు లిఖిత పూర్వ‌కంగా తాను ఫిర్యాదు చేసినా సీఎం ప‌ట్టించుకోవ‌డంలేద‌ని అమె మండిప‌డ్డారు. 
 
చంద్ర‌బాబు నాయుడు అధికారంలో ఉన్న‌ప్పుడు ఒక విధంగా ప‌ట్టించుకుంటార‌ని, అధికారంలో లేన‌ప్పుడు ఒక విధంగా ప‌ట్టించుకుంటార‌ని నిమ్మ‌గ‌డ్డ సీత మండిప‌డ్డారు. టీడీపీ నాయ‌కుల‌కు రాష్ట్ర అభివృద్ది త‌క్కువ రాజ‌కీయాలు ఎక్క‌వ‌ని ఆమె విమ‌ర్శ‌లు చేశారు. అందుకే తాను ఈ రాజ‌కీయాల‌కు త‌ట్టుకోలేక టీడీపీకి రాజీనామా చేశాన‌ని స్ప‌ష్టం చేశారు. 
 
అధికారంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కేవ‌లం రాజ‌కీయాలు మాత్ర‌మే చేస్తే రాష్ట్ర ప్ర‌జ‌లు దానిని తిర‌స్క‌రిస్తార‌ని, ప్ర‌జా సేవ చేస్తేనే ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొంద‌వ‌చ్చని సీత స్ప‌ష్టం చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు ఇచ్చిన మ‌ర్యాద కూడా చంద్ర‌బాబు నాయుడు త‌న‌కు ఇవ్వుడంలేద‌ని ఆమె మండిప‌డ్డారు. ప్రజాసేవ చేయ‌కుండా ఎప్పుడు చంద్ర‌బాబు చుట్టూ భ‌జ‌న చేసే వారిని మాత్ర‌మే ఆయ‌న న‌మ్ముతార‌ని నిమ్మ‌గ‌డ్డ సీత ఆరోపించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.