వైసీపీలోకి కీల‌కనేత‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-26 16:42:49

వైసీపీలోకి కీల‌కనేత‌

ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన‌ ప్ర‌జా సంక‌ల్ప‌యాత్రుకు అడుగ‌డుగునా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు... ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌డుతూ, అధికార బ‌లంతో టీడీపీ నాయ‌కులు చేస్తున్నఅక్ర‌మాల‌ను ప్ర‌జ‌ల‌కు క్షుణ్ణంగా వివ‌రిస్తున్నారు జ‌గ‌న్... అంతేకాదు  నిరంత‌రం ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారుప్ర‌తిప‌క్ష నేత‌.. దీంతో పాటు ప్లీన‌రీలో ప్ర‌క‌టించిన న‌వ‌రత్నాల‌ను జ‌నాల‌కు వివ‌రిస్తున్నారు.
 
అయితే ప్ర‌స్తుతం ఈ సంక‌ల్ప‌యాత్ర తెలుగుదేశం పార్టీ కంచుకోట అయిన గుంటూరు జిల్లాలో నిర్విరామంగా కొన‌సాగుతోంది... ఈ యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్ కు జ‌నాలు తెలుపుతున్న మ‌ద్ద‌తును చూసి ప‌లుచోట్ల టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌తో పాటు ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయ‌కులు సైతం వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడి అవుతున్నారు.
 
అయితే ఈ నేప‌థ్యంలో గుంటూరుకు జిల్లా టీడీపీ నేత నిమ్మ‌కాయ‌ల రాజ‌నారాయ‌ణ వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు స‌ర్వం సిద్దం చేసుకున్న‌రు.. కాగా ఈ నెల 27వ తేదీన సత్తెనపల్లిలో జగన్ పాదయాత్ర కొనసాగనుంది. ఈ యాత్ర‌లో భాగంగా జగన్ సమక్షంలో నిమ్మకాయల  రాజ‌నారాయ‌ణ వైసీపీలో చేర‌నున్నారు.
 
నిమ్మ‌కాయ‌ల‌తో పాటు అత‌ని స‌న్నిహితులు, రెండు మండ‌లాల‌కు చెందిన టీడీపీ కార్య‌క‌ర్త‌లు కూడా జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.. ఇందుకోసం వైసీపీ రాజకీయ సలహా కమిటీ సభ్యుడు గుబ్బా చంద్రశేఖర్ తో నిన్న నిమ్మకాయల చర్చలు జరిపారు..2009 ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.