మై డ్రామా ఈజ్ కంటిన్యూ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-26 04:16:29

మై డ్రామా ఈజ్ కంటిన్యూ

ఓ వైపు ధ‌ర్మ‌పోరాటం అంటూ ధ‌గా పోరాటం చేస్తున్న ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు... ఏపీలోని ప్ర‌త్యేక హోదా ఉద్య‌మంపై మాత్రం దాడీ చేయిస్తున్నారు. మొన్నటికి మొన్న ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బంద్ పై ముఖ్యంత్రి చంద్ర‌బాబు ఉక్కుపాదం మొపాల‌ని చూశారు. 
 
అయితే ఈ క్ర‌మంలో రాత్రికి రాత్రి సెక్ష‌న్ 30ని అమ‌లు చేసి... మ‌రీ పోలీసుల‌తో వైసీపీ బంద్ ను అడ్డుక‌ట్ట వేసేందుకు ప్ర‌య‌త్నాలు చేశారు. ఈ బంద్ లో సుమారు ప‌దివేల మందికి పైగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులను కార్య‌క‌ర్త‌ల‌ను, అలాగే ప్ర‌త్యేక హోదా ఉద్య‌మ కారుల‌ను ఒక్క‌రోజే 10 వెల మందికి పైగా అక్ర‌మంగా అరెస్ట్ ల‌ను  చేయించారు. అంతేకాదు ఈ బంద్ కు  స్వ‌చ్చందంగా హాజ‌రు అయిన మ‌హిళ‌ల‌ను కూడా పాశ‌వికంగా  ప్ర‌వ‌ర్తించి పోలీసులు ఈడ్చుకువెళ్లి మ‌రీ అరెస్ట్ చేశారు. 
 
ఓ వైపు ప్ర‌త్యేక హోదా కావాలంటున్న టీడీపీ... ఇంకో వైపు ప్ర‌త్యేక హోదా ఉద్య‌మాన్ని తుంగ‌లో తొక్కెయ్య‌డంపై స‌ర్వ‌త్ర విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. అయితే గతంలో కూడా ప్ర‌త్యేక హోదా కోసం ఉద్య‌మం జ‌రిగిన ప్ర‌తీసారి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఇలానే ఉక్కుపాదం మొపుతూనే వ‌స్తున్నారు. దీంతో టీడీపీ నాయ‌కులు ప్ర‌త్యేక హోదా విష‌యంలో వ్య‌తిరేకి అనే విష‌యం త‌మ‌కు అర్థం అయింద‌ని విప‌క్షాలు మండిప‌డుతున్నాయి. 
 
ఏపీలో జ‌రుగుతున్న ఉద్య‌మాన్ని అన‌చివేస్తున్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. టీడీపీ ఎంపీలు ఢిల్లీలో మాత్రం డ్రామా న‌డుపుతున్నారు. రాజ్య‌స‌భ సాక్షిగా మ‌రోసారి టీడీపీ డ్రామా బ‌ట్ట‌బ‌య‌లు అయింది. రాజ్య‌స‌భ‌లో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌మ‌ని చెప్పినా ఎక్క‌డా నిర‌సన తెలుప‌లేదు. లోక్ స‌భ‌లో గాంధీ విగ్ర‌హం వ‌ద్ద ఫోటోలు, మీడియా ముందు ఇంట‌ర్వ్యూల‌ను ప‌రిమితం అయ్యారు త‌ప్ప స‌భ‌లో ఏమీ చెయ్య‌లేదు. 
 
రాస్య స‌భ‌లో కేంద్రాన్ని నిల‌దీయ‌డానికి టీడీపీ నాయ‌కులు నీల్లు న‌మిలారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చేసుకున్న ఒప్పందాన్ని ప్ర‌ధాని మోడీ, అలాగే కేంద్ర‌మంత్రులు బ‌య‌ట పెట్ట‌డంతో టీడీపీ ఎంపీల రాజ‌కీయం బ‌య‌ట‌ప‌డింది. మోడీ ప్ర‌సంగం త‌ర్వాత‌ రాజ్య‌స‌భ‌లో హోం మంత్రి హోదా ఇవ్వ‌న‌న్న త‌ర్వాత తెలుగు త‌మ్ముళ్లు ఎక్క‌డ నిర‌స‌న తెలుప‌లేదు. కేంద్రాన్ని ఏపీలో వ్య‌తిరేకిస్తూ వైసీపీ న‌డిపిస్తున్న ఉద్య‌మంపై దాడీ చేస్తూ మ‌రోవైపు ఢిల్లీ కేంద్రాన్ని నిల‌దీయ‌కుండా డ్రామాల‌తో కాలం గ‌డిపెయ్య‌డంపై ఏపీ ప్ర‌జ‌ల్లో తీవ్ర‌వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతోంది. 
 
 
 
 
 
Attachments area
 
 
 
 
 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.