చంద్ర‌బాబు పై నాన్ బెయిల్ వారెంటీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-09-14 11:43:57

చంద్ర‌బాబు పై నాన్ బెయిల్ వారెంటీ

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుకు మహారాష్ట్ర‌లోని ధ‌ర్మ‌బాద్ కోర్టు నాన్ బెయిల్ వారెంటీ జారీ చేసింది. 2010లో ఆయ‌న బాబ్లీ ప్రాజెక్ట్ కు వ్య‌తిరేకంగా ధ‌ర్నా చేసినందుకు అప్ప‌ట్లో ఆయ‌న‌పై కేసు న‌మోదు అయింది. అయితే ఈ కేసులో భాగంగా  ధ‌ర్మ‌బాద్  కోర్టు 14వ తేదిన‌ హాజ‌రు కావాలంటూ వారెంటీ జారీ చేసింది.
 
ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతోపాటు మ‌రో 14 మందికి వారెంటీలు జారీ అయ్యాయి. అయితే ఎనిమిదేళ్లుగా ఒక్క‌సారి కూడా నోటీసులు ఇవ్వకుండా ఇప్పుడు ఏకంగా నాన్ బెయిల్ వారెంటీ చేయ‌డంప‌ట్ల పార్టీ నాయ‌కులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. వారెంటీ జారీ అయిన వారిలో తెలంగాణ ఏపీ ప్ర‌జా ప్ర‌తినిధులు ఉన్నారు. చంద్ర‌బాబు శ్రీవారి సేవ‌లో ఉన్న స‌మ‌యంలోనే ఆయ‌న‌కు నోటీసులు వ‌చ్చిన‌ట్లు తెలుసుకున్నారు.  

షేర్ :