ఓటుకు కోట్లు కేసులో చంద్ర‌బాబుకు మ‌రో బిగ్ షాక్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu
Updated:  2018-11-02 12:45:13

ఓటుకు కోట్లు కేసులో చంద్ర‌బాబుకు మ‌రో బిగ్ షాక్

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు గ‌తంలో ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా ఇరుక్కున్న సంగ‌తి మ‌నంద‌రికీ తెలిసిందే. అయితే ఈ కేసు విష‌యంలో ఎట్ట‌కేల‌కు సుప్రీం కోర్టులో  విచార‌ణ జ‌రుగ‌నుంది. అంతేకాదు ఫిబ్ర‌వ‌రిలో ఈ కేసుకు సంబంధించి విచార‌ణను సుప్రీం కోర్టు చేప‌ట్ట‌నుంది. 
 
ఈ కేసును త్వ‌రితగ‌తిన విచార‌ణ చేయాలంటూ ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి దాఖ‌లు చేసిన పిటీష‌న్ పై  విచారించిన స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ఈ మేర‌కు ఆదేశాల‌ను జారీ చేసింది. అయితే మ‌రికొద్ది రోజుల్లో ఎన్నిక‌లు ఉన్నాయంటూ ఈ విచార‌ణ‌ను అడ్డుకునేందుకు టీడీపీ అనేక‌ ప్ర‌య‌త్నాలు చేసింది. ఈ క్ర‌మంలో త‌మ‌పై రాజ‌కీయ శ‌త్రుత్వంతోనే పిటీష‌న్ వేశార‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త‌ర‌పు న్యాయ‌వాది సిద్దార్ద్ సుప్రీం కోర్టులో త‌మ వాద‌న‌లు వినిపించారు.
 
ఫిబ్ర‌వ‌రి మార్చిలో ఎన్నిక‌లు ఉంటాయ‌ని అందుకే ఈ కేసు విచార‌ణ చేయ‌వ‌ద్దని న్యాయ‌స్థానానికి ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. అయితే తాజాగా ఈ వాద‌న‌ల‌ను తోసిపుచ్చింది న్యాయ‌స్థానం. ఎన్నిక‌ల విష‌యంలో తామేమి చేయ‌లేమ‌ని జ‌స్టిస్ మ‌ద‌బీ లోకూర్ అన్నారు. దీంతో ఓటుకు కోట్లు కేసును ఫిబ్ర‌వ‌రిలో విచార‌ణ‌కు లిస్ట్ త‌యారు చేశార‌ని న్యాయ‌స్థానం కోరింది.