టీడీపీ మంత్రి పితానికి నోటీసులు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-11 18:16:47

టీడీపీ మంత్రి పితానికి నోటీసులు

ఏపీ అధికార తెలుగుదేశంపార్టీ మంత్రి పితాని స‌త్య‌నారాయ‌ణ‌కు మ‌త్స్య‌కార శాఖ అధికారులు తాజాగా నోటీసులు జారీచేశారు. నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా మంత్రి రొయ్య‌ల చెరువును త‌వ్వార‌ని అయితే వాటిని ధ్వంసం చేస్తామ‌ని  మ‌త్స్య‌కార శాఖ నోటీసులను జారీ చేసింది. మంత్రి పితానికి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పోడూరు మండ‌లం కొమ్ముచిక్కాల‌లో ఒక ఎక‌రం 17 సెంట్లుతో కూడిని రోయ్య‌ల‌ చెవులు ఉంది. గ‌తంలో ఆయ‌న వ్య‌వ‌సాయ భూమిగా ఉన్న ఈ భూమిని మంత్రి మార్పు చేసి రొయ్య‌ల చెరువు కోసం అధికారుల‌కు ధ‌రఖాస్తు చేశారు. ఇక అప్ప‌టినుంచి మంత్రి రొయ్య‌ల చెరువును కొన‌సాగిస్తున్నారు. 
 
అయితే ఈ నేప‌థ్యంలో ఇదే గ్రామానికి చెందిన ఓ వ్య‌క్తి అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు జిల్లా క‌లెక్ట‌ర్ చ‌ర్య‌లు తీసుకున్నారు. అంతేకాదు గతంలో మంత్రి పితానికి జిల్లా క‌లెక్ట‌ర్ కు తీవ్రమైన విభేదాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫిర్యాదు జిల్లా క‌లెక్ట‌ర్ సీరియ‌స్ గా తీసుకుని మంత్రి పితానితో పాటు గ్రామానికి చెందిన సుమారు 83 మంది అధికారులకు నోటీసులు జారీ చేశారు. 
 
చాలా కాలంగా తాము రొయ్య‌ల చెరువును సాగుచేస్తున్నాము ఇప్పుడు అక‌స్మాత్తుగా రొయ్య‌ల చెరువుకు అనుమ‌తి లేద‌ని నోటీసులు జారీ చేయ‌డంపై అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. అధికారులు నోటీసులు ఇవ్వ‌డంతో త‌మ‌కు జీవ‌నోపాధి అయిన రొయ్య‌ల చెరువును ఎలా ధ్వంసం చేస్తారంటూ నేరుగా క‌లెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అయితే ఈ రొయ్య‌ల చెరువులు అక్ర‌మంగా ఏర్పాటు చేసిన‌వి క‌నుక తాము ఖ‌చ్చితంగా ధ్వంసం చేయ‌డం జ‌రుగుతుంద‌ని క‌లెక్ట‌ర్ వారికి తెలిపారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.