నిన్న జ‌గ్గారెడ్డి అరెస్ట్ నేడు రేవంత్ రెడ్డి నెక్ట్స్ చంద్ర‌బాబే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

revanth reddy and chandrababu and jagga reddy
Updated:  2018-09-12 14:36:24

నిన్న జ‌గ్గారెడ్డి అరెస్ట్ నేడు రేవంత్ రెడ్డి నెక్ట్స్ చంద్ర‌బాబే

2019  ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ఏపీతో పాటు తెలంగాణ రాజ‌కీయాలు కూడా హాట్ హాట్ గా సాగుతున్నాయి. బుల్లితెర బిగ్ బాస్ హోస్ట్ హీరో నాని చెప్పిన‌ట్లు ఈ సీజ‌న్ లో ఏమైనా జ‌రుగ‌వ‌చ్చు కాస్త మ‌సాలా యాడ్ చెయి బాబాయ్ అన్న‌ట్లు తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో రాజ‌కీయాల్లో గుంటూరు మిర్చి కేర‌ళ మిరియాలు యాడ్ చేసి ర‌స‌వ‌త్త‌రంగా సాగిస్తున్నారు. 
 
వ‌చ్చే ఎన్నికల్లో త‌మ‌దే విజ‌యం అని అధికార టీఆర్ఎస్ నాయకులు అంటుంటే...లేదు..లేదు  వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీదే విజ‌యం అని టీఆర్ఎస్ పార్టీని రానున్న రోజుల్లో ప్ర‌జ‌లు బొంద‌పెట్ట‌డం ఖాయం అంటు ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను ఓడించేందుకు వామ‌ప‌క్షాల‌న్ని కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని ఆ పార్టీ నేత ఉత్త‌మ్ కుమార్ రెడ్డి పిలుపునివ్వ‌డంతో ఏపీ ముఖ్య‌మంత్రి  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు వారి పిలుపు మేర‌కు పొత్తుల దిశ‌గా ముందుకు వెళ్తున్నారు. 
 
అయితే ఈ క్ర‌మంలో కేసీఆర్ కాంగ్రెస్ నాయ‌కులు గ‌తంలో చేసిన కార్య‌క్రమాల‌కు సంబంధించి పాత ఫైళ్ల‌ను బ‌య‌ట‌కు తీసి ప‌లు సెక్ష‌న్ల కింద అరెస్ట్ చేయిస్తున్నారు. అయితే ఇదే క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత మాజీ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డిని న