జ‌గ‌న్ పై హ‌త్యాయ‌త్నం విష‌యంలో వైసీపీ ఎమ్మెల్యేకు, నేత‌కు నోటీసులు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp and ys jagan
Updated:  2018-10-31 03:02:37

జ‌గ‌న్ పై హ‌త్యాయ‌త్నం విష‌యంలో వైసీపీ ఎమ్మెల్యేకు, నేత‌కు నోటీసులు

అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన హ‌ర్ష‌వ‌ర్ద‌న్ నిర్మించుకున్న విశాఖ ఎయిర్ పోర్టు క్యాంటిన్ లో వెయిట‌ర్ గా ప‌నిచేస్తున్న శ్రీనివాసరావు గ‌త బుధ‌వారం రోజున ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై దాడి చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసు విష‌యంలో సిట్ బృందం విచార‌ణ ముమ్మ‌రంగా కొన‌సాగిస్తుంది. 
 
ఈ విచార‌ణ‌లో శ్రీనివాసరావు స్నేహితుల‌ను, దాడికి స‌హ‌క‌రించిన కొంద‌రు వ్య‌క్తుల‌ను నిందితుడి కాల్ డేటా ద్వారా పోలీస్ అధికారులు అరెస్ట్ చేసి వారిని కూడా విచారిస్తున్నారు. అయితే ఇదే క్ర‌మంలో వైసీపీ సాలూరు ఎమ్మెల్యే  రాజ‌న్న దొర‌కు అలాగే పార్టీ నేత మ‌జ్జి శ్రీనివాస‌రావుకు సిట్ అధికారులు తాజాగా నోటీసులు అందించారు. నవంబ‌ర్ 2వ తేదిన విశాఖ‌లోని సిట్ కార్యాలయంలో జ‌రిగే విచార‌ణ‌లో వీరిద్ద‌రూ పాల్గొనాల‌ని నోటీసుల్లో పేర్కొంది. 
 
నాలుగ‌వ రోజు నిందితుడు శ్రీనివాస‌రావును విచారించిన సిట్ బృందం తాజాగా విజ‌య‌న‌గ‌రం జిల్లాకు వ‌చ్చి నోటీసుల‌ను వైసీపీ నాయ‌కుల‌కు అందించారు. గ‌త బుధ‌వారం రోజునాడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై శ్రీనివాస‌రావు అనే వ్య‌క్తి  హత్యాయ‌త్నం చేసే స‌మ‌యంలో వీరిద్ద‌రూ ప‌క్క‌నే ఉన్నందున వీరిని విచారించేందుకు సిట్ బృందం నోటీసులు అందించింది. అయితే తా