రైల్వేలో భారీ ఉద్యోగాల నోటిఫికేష‌న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Indian railway jobs
Updated:  2018-06-26 04:02:08

రైల్వేలో భారీ ఉద్యోగాల నోటిఫికేష‌న్

పోలీస్ ఉద్యోగాలకోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగుల‌కు ప్రొటెక్ష‌న్  ఫోర్స్ లో ఎస్సై, కానిస్టేబుల్ పోస్ట్ ల భ‌ర్తీ కోసం రైల్వే రిక్యూర్ మెంట్ బోర్డు ఇక నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన‌ట్లు ఇక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. అందులో ఎస్సై పోస్ట్ లు 1120 ఉండ‌గా కాస్టేబుల్ 8000 పోస్ట్ లు భ‌ర్తీ కోసం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. 
 
ఆస‌క్తి క‌లిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆర్ పీఎఫ్ ఎస్సై పోస్ట్ కు డిగ్రీ చదివిన వారు అర్హులు. ఇక కానిస్టేబుల్ పోస్టుల‌కు ఇంట‌ర్ అర్హ‌త ఉండాలి. అలాగే స‌బ్ ఇస్పెక్ట‌ర్ పోస్ట్ కు వ‌య‌స్సు 20 నుంచి 25 సంవ‌త్స‌రాలోపు ఉండాలి. కానిస్టేబుల్ పోస్ట్ ల‌కు 18 నుంచి 25 వ‌య‌స్సులోపు ఉండాలి. ఆస‌క్తి క‌లిగిన వారు ఈ నెల 30 తేదిలోపు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలని రైల్వే బోర్డ్ సూచించింది.
 
ఎంపికైన ఎస్సై అభ్య‌ర్థుల‌కు ప్ర‌ర‌భం నుంచి ప్ర‌తీ నెల 35400 జితం అలాగే రైల్వే బోర్డులో ఉన్న అన్ని అల‌వెన్స్ వ‌ర్తిస్తాయి. అలాగే సీఆర్ పిఎఫ్ కానిస్టేబుల్ పోస్ట్ ల‌కు ఎంపికైన అభ్య‌ర్థుల‌కు 21700 రూపాయ‌లు ప్ర‌తీ నెల జీత భ‌త్యాలు అందించ బ‌డుతుంద‌ని తెలిపారు, ఈ పోస్ట్ ల‌కు ద‌ర‌కాస్తు చేసుకున్న అభ్య‌ర్థులు సెప్టెంబర్ లో ఆన్ లైన్ ప‌రీక్ష‌ జ‌రుగుతుంది. ఈ ప‌రీక్ష‌లో నెగ్గిన వారు శారీర‌క ప‌రీక్ష‌లు నెగ్గాలి. అభ్య‌ర్థులు మ‌రిన్ని వివ‌రాల‌కు www.indianrailways.gov.in వెబ్ సైట్ లో చూడ‌వ‌చ్చు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.