జ‌గ‌న్ కోసం ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-11 12:37:43

జ‌గ‌న్ కోసం ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు

ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన‌ ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర మ‌రో మైలురాయిని అదిగ‌మించ‌నుంది. వైఎస్‌ఆర్ క‌డ‌ప జిల్లా, పులివెందుల నియోజకవర్గం ఇడుపులపాయలో నవంబరు 6, 2017న‌ మొద‌లైన‌ ఈ సంక‌ల్ప‌యాత్ర నేడు టీడీపీ కంచుకోట కృష్ణా జిల్లాలో నిర్విరామంగా కొన‌సాగుతోంది. ఈ సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్  2000 వేల కీ.మీ మైలురాయిని అదిగ‌మించనున్నారు.
 
ఈ నేప‌థ్యంలో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ మలేసియా కన్వీనర్ రేవంత్ తిప్పరాజు ఆధ్వర్యంలో గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ బి.హెచ్, కువైట్ కో కన్వీనర్ యం .వి. నరసా రెడ్డి, గల్ఫ్ ప్రతినిధి షేక్ నాసర్, జగన్ హెల్పింగ్ హైన్డ్స్ అధ్యక్షుడు షేక్ జబీవుల్లా, N R I లు ఓబులపు మోహన్ రెడ్డి, షేక్ ఆన్సర్, షేక్ గయాజ్, బాబు, షేక్ జిలాన్, ఆలీ మౌల, తదితరులు పాల్గొని పెద్ద దర్గాలో చాదర్ కప్పి ప్రత్యేక ప్రార్ధనలు చేశారు.
 
ఈ సందర్భంగా ఇలియాస్ ,రేవంత్ రాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాక్షస పాలన రాజ్యమేలుతోందని మహిళలకు పూర్తిగా రక్షణ లేకుండా పోయిందని బేటీ బేటీ బచావ్ అంటే పుట్టబోయే ఆడపిల్లలను  కడుపులోనే రక్షించమని ప్రజలు వేడుకుంటున్నార‌ని అన్నారు. టీడీపీ, బీజేపీ నాయ‌కులు ఆడపిల్లలకు ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిందిపోయి, వారి  నుంచి ఆడ‌పిల్ల‌ల‌ను రక్షించుకోవాల్సిన ప‌రిస్థి వ‌చ్చింద‌ని వారు ఎద్దవా చేశారు. 
 
అలాగే నరసా రెడ్డి , నాసర్ మాట్లాడుతూ... రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా కుంటూ పడిందని రాష్ట్ర అభివృద్ధి కేవలం పత్రిక ప్రకటనలకే పరిమితం అయింద‌ని ఆరోపించారు. స్టేజ్ ఎక్కి మైక్ పట్టి మాట్లాడిన పిట్టల దొర లాగ మాటలు కోటలు దాటుతాయి అని మండిప‌డ్డారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా అన్ని వర్గాల ప్రజలకు అందరికి సంక్షేమ పథ‌కాలు అందాలన్నా 2019 లో జననేత జగన్ ను ముఖ్యమంత్రి చేసుకోవాల‌ని వారు పేర్కొన్నారు. అయితే ఇందు కోసం నేడు ప్రఖ్యాత గాంచిన పెద్ద దర్గాలో ప్రజా సంకల్పయాత్ర చేస్తున్నఅధినేత జ‌గ‌న్  ఆరోగ్యంగా ఉండాలని ఎటువంటి ఆటంకలు జ‌రుగ‌కుండా పాదయాత్ర పూర్తి చేయాల‌ని ప్రార్ధనలు చేశారు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.