ఎన్ .ఆర్. ఐ లు క్యూ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-07 16:23:59

ఎన్ .ఆర్. ఐ లు క్యూ?

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు సీటు ఫిక్స్ చేసుకోవాలి అని నాయ‌కులు, అలాగే రాజ‌కీయ అభిలాష ఉన్న‌వారు క్యూ క‌డుతున్నారు... నేరుగా జ‌గ‌న్ కు లేదా పార్టీలో సీనియ‌ర్ల‌కు వారి సీట్లను క‌న్ఫామ్ చేసుకోవ‌డానికి రెడీ అవుతున్నారు... అయితే చాలా ప్రాంతాల్లో జ‌గ‌న్ ఇప్ప‌టికే వైసీపీ త‌ర‌పున అసెంబ్లీ టిక్కెట్ల‌ను క‌న్ఫామ్ చేస్తూ వ‌స్తున్నారు.. ఇక ఎంపీల టికెట్ విష‌యంలో కూడా వైసీపీ చాలా స్ట్రాంగ్ గా ముందుకు వెళుతోంది.
 
అమ‌రావ‌తి రాజ‌ధాని కేపిట‌ల్ సిటీగా ఉన్నగుంటూరు - విజ‌య‌వాడ ఎంపీ టికెట్ల విష‌యంలో ఇప్ప‌టికే అనేక మంది వైసీపీ త‌ర‌పున క్యూలో ఉన్నారు... ఇక గుంటూరు ఎంపీ సీటు ఫిక్స్ అయిపోవ‌డం న‌ర‌స‌రావు పేట సీటు విష‌యంలో కూడా, కీల‌క నేత‌కు సీటు ఇస్తాను అని జ‌గ‌న్ హామీ ఇవ్వ‌డంతో, ఇప్ప‌డు విజ‌య‌వాడ సీటు పై అంద‌రి ఫోక‌స్ ఉంది.
 
అయితే తాజాగా విజ‌య‌వాడ ఎంపీ సీటు కోసం ఏపీలో నాయ‌కులు, రాజ‌కీయాల్లో సీనియ‌ర్లు కాకుండా ఎన్ ఆర్ ఐలు కూడా క్యూ క‌డుతున్నారు అని తెలుస్తోంది... కృష్ణా జిల్లాలో ఉండి అమెరికాలో స్థిరపడిన వారిలో సంపన్నులు రాజకీయ అభిలాష ఉన్నవారు ఇప్ప‌టికే జిల్లా నాయ‌కుల‌తో మంత‌నాలు జ‌రుపుతున్నారు అని తెలుస్తోంది.
 
నందిగామ ప్రాంతం నుంచి అమెరికా వెళ్లి అక్కడ వ్యాపార రంగంలో స్థిరపడిన సురేష్ రెడ్డి  అనే ఎన్‌ఆర్‌ఐ వైసీపీ త‌ర‌పున టికెట్ అడుగుతున్నారు అట‌.. అలాగే  ఇక్క‌డ  మార్కెట్‌ యార్డు చైర్మన్‌గా పనిచేసిన ప్రముఖ కాంగ్రెస్‌ నేత బంధువు ఒకరు అమెరికాలో ఉన్నారు. ఆయ‌న కూడా వైసీపీ త‌ర‌పున పోటీ చేయాలి అని టికెట్ కోసం ఎదురుచూస్తున్నారు అని తెలుస్తోంది.. ఇక క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన ఓ  కీల‌క నేత  మ‌రో యంగ్ స్ట‌ర్ ఇక్క‌డ పోటీ చేయ‌డానికి రెడీ అవుతున్నారు అని తెలుస్తోంది.
 
అయితే  సినీ ప్రముఖులు, హీరో కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు విజయవాడ నుంచి వైసీపీ తరఫున పార్లమెంట్‌కు పోటీ చేస్తారని ప్రచారం జరిగింది.... ఆయన ఎంపీ సీటు కాకుండా తెనాలి అసెంబ్లీ నుంచి పోటీ చేసే అవ‌కాశం ఉంది అని వార్త‌లు రావ‌డంతో ఇప్పుడు ఎంపీ సీటు కోసం క్యూ పెరుగుతోంది...గత ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రముఖ పారిశ్రామికవేత్త కోనేరు ప్రసాద్‌ పోటీ చేశారు. టీడీపీ బీజేపీ జ‌న‌సేన పోటీలో ఆయ‌న ఓట‌మి పాల‌య్యారు.మొత్తానికి వైసీపీలో సీట్ల కోసం మంచి పోటీ కనిపిస్తోంది... ఇక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డితే మ‌రింత హీట్ పెర‌గ‌డం ఖాయం అని అంటున్నారు విశ్లేష‌కులు..

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.