జ‌గ‌న్ నిర్ణ‌యం పై ఎన్టీఆర్ ఆనందం ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-02 04:19:58

జ‌గ‌న్ నిర్ణ‌యం పై ఎన్టీఆర్ ఆనందం ?

తెలుగుదేశం నాయ‌కులు అంద‌రూ రెండు రోజులుగా జ‌గ‌న్ పై కేర‌ళ మిరియాలు,  గుంటూరు కారాలు, గోదావరి పుల‌స‌లు నూరుతున్నారు.. ఏదైనా నిర్ణ‌యం తీసుకుంటే మా బాబుగారు తీసుకోవాలి కాని జ‌గ‌న్ తీసుకోవ‌డం ఏమిటి అని కొంద‌రు నేత‌లు భోజ‌నం చేయ‌డం కూడా మానేశారు.. నీర‌సం వ‌చ్చినా ప‌ర్వాలేదు నాది ధ‌ర్మ‌పోరాట ధీక్ష అంటున్నారు... అస‌లు ధ‌ర్మం  ఏమిటి, జ‌గ‌న్ చేసిన త‌ప్పు ఏమిటి అంటే?  యుగ‌పురుషుడు అని తెలుగువారు అంద‌రూ కీర్తించే ఎన్టీఆర్ పేరును  కృష్ణా జిల్లా పేరుగా నామ‌క‌ర‌ణం చేశారు అదే ప్ర‌క‌టించారు,  తాము అధికారంలోకి వస్తే కృష్ణా రూపురేఖ‌ల‌తో పాటు ఆ మ‌హానుభావుడు పేరు జిల్లాకు పెడ‌తాము అన్నారు జ‌గ‌న్ .
 
ఇక జ‌గ‌న్ నోటి నుంచి వ‌చ్చిన ఈ ఆణిముత్యం పై ఇప్ప‌టికే వైసీపీ పాలాభిషేకాలు చేస్తుంటే, తెలుగుదేశం మాత్రం విషం చిమ్ముతోంది... తెలుగుదేశం గెజెట్ ప‌త్రిక‌ల్లో జ‌గ‌న్ చేస్తోంది త‌ప్పు?  జ‌గ‌న్ రాజ‌కీయం కోసం చేస్తున్నారు అంటూ క‌వ‌రేజ్ చేస్తున్నారు... ఇక ఆస్ధాన మీడియాలు కూడా కొంద‌రు తెలుగుదేశం నేత‌ల వ‌ద్ద‌కు మాత్ర‌మే వెళ్లి, దీనిపై మీ కామెంట్ ఏమిటి అంటున్నారు?  అయితే ఇక్కడ జ‌నం చెవిలో బొండుమ‌ల్లె పెట్టుకున్నార‌ని ఈ ఆస్ధాన మీడియాలు భావిస్తున్నాయి...  అస‌లు జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం  పార్టీల నాయ‌కుల‌ను అడ‌గ‌డం ఏమిటి?  జ‌నాల‌ని అడ‌గాలి, వారి ఓపీనియ‌న్ తీసుకోవాలి, ర్యాండ‌మ్  స‌ర్వే చేసుకోవాలి...  జ‌గ‌న్ ఈ నిర్ణ‌యం ప్ర‌జ‌లు  బాగుంది అంటే ఎస్  అని ,లేదు అంటే ప్రజా ఓపినియ‌న్ ఇది అని చెప్పాలి.... ఇలా కాకుండా  కొన్ని మీడియాలు పైపులు తీసుకుని తెలుగుదేశం నేత‌ల కోసం నాలుగు ఐదు గంట‌ల పాటు వెయిట్ చేసి, జ‌గ‌న్ ని తిట్టించ‌డానికి చెమ‌టోర్చుతున్నాయి.
 
ఇక తెలుగు అద్బుతంగా మాట్లాడే కొంద‌రు నేత‌లు జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు చేయ‌డం, దానిని శాటిలైట్ కు చిల్లుప‌డేలా చూపించ‌డ‌మే భ‌జ‌న‌గా చేస్తున్నాయి కొన్ని ఎల్లో మీడియాలు... అయితే ఈ విష‌యం పై ఎన్టీఆర్ ఆనందప‌డ‌తార‌ని ఎన్టీఆర్ కుటుంబ  స‌భ్యులు నిమ్మకూర‌లో అంటున్నారు.... ఇక వైసీపీలో ఉన్న ఎన్టీఆర్ స‌తీమ‌ణి ల‌క్ష్మీపార్వ‌తి  అదే అన్నారు.... అయితే జ‌నాలు అంద‌రికి ఎన్టీఆర్ పేరు ఒకే కాని తెలుగుదేశం నేత‌ల‌కు మాత్ర‌మే న‌చ్చ‌లేదు.... ఇక తెలుగుదేశం నాయ‌కుల పై ప్ర‌జ‌లే విమ‌ర్శ‌లు చేస్తున్నారు... అస‌లు ఎన్టీఆర్ పేరు పెట్టాలి అనే థాట్ మీకు రాలేదు? వ‌చ్చిన జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు చేయ‌డం ఏమిటి అని అంటున్నారు... నాడు వైశ్రాయ్ హూటల్ అంశంతోనే తెలుగుదేశం లోఎన్టీఆర్ ముద్ర‌ను తొలిగించారు అని, ఇక ఆయ‌న విగ్ర‌హాల‌కు పూల‌మాలలు వేసి పార్టీ మ‌నుగ‌డ కోసం నాయ‌కుల ఎదుగుద‌ల కోసం ఆయ‌న్ని  కీర్తిస్తున్నారు కాని కొంద‌రు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.
 
ఇక్క‌డ అన్నింటికంటే ఇంట్ర‌స్టింగ్ విష‌యం ఏమిటి అంటే?  చంద్ర‌బాబు వెన్నంటి ఉండే సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు అదే ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న ఓ కామెంట్ చేశారు... కాదు ఓ స్టేట్ మెంట్ ఇచ్చారు..జిల్లాలు పెరిగాక నిమ్మకూరు ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని ఎప్పుడో నిర్ణయించామని అన్నారు... అదీ సంగ‌తి కాపీ పేస్టు  ఇంకా జ‌ర‌గ‌డం లేదు ఏమిటి జ‌గ‌న్ నిర్ణ‌యం మాదే అని ఇంకా ఏ తెలుగు నేత అన‌డం లేదు అని సోష‌ల్ మీడియాలో పోస్టులు వైర‌ల్ అవుతున్నాయి.. ఇక మొద‌లైంది..
 
జ‌గ‌న్ ఇలా పేరు ప్ర‌క‌టించాడో లేదో ఈ నిర్ణ‌యం మాదే మేము ఎప్పుడో ఎన్టీఆర్ పుట్టిన‌ప్పుడు  ఎన్టీఆర్ సినిమాల్లోకి వ‌చ్చిన‌ప్పుడే ఫిక్స్ అయిపోయాం అంటున్నారు..  ప్ర‌జ‌లు మాత్రం ఎన్టీఆర్ పేరు పెట్ట‌డం పై హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.. నిజంగా జ‌గ‌నూ ఓ మంచి డెసిష‌న్ తీసుకున్నావు?
 
విశ్లేషణ !! గ‌ణేష్.వి
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.