వైసీపీలోకి ఎన్టీఆర్ మ‌న‌వ‌డు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-25 03:15:18

వైసీపీలోకి ఎన్టీఆర్ మ‌న‌వ‌డు

ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఇటు రాజ‌కీయాల్లో కానీ, అటు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో కానీ అదును చూసుకుని వార‌సులు ఎంట్రీ ఇవ్వ‌డం స‌ర్వ సాధార‌ణం అయిపోయింది. ఇక వారసుల‌కు పునాదులు వెయ్య‌డానికి త‌ల్లిదండ్రులు ఏళ్ల త‌ర‌బ‌డి శ్ర‌మిస్తుంటారు. తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు మాజీ ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క‌రామారావు మ‌నవ‌డు రాజ‌కీయ రంగ ప్ర‌వేశానికి అనేక స‌మ‌స్య‌లు క‌నిపిస్తున్నాయి. 
 
ఎన్నిక‌ల ఖ‌ర్చు త‌ట్టుకోలేకపోతున్నాన‌ని చెప్పి వెంక‌టేశ్వ‌ర‌రావు రాజ‌కీయాల నుంచి కొద్ది రోజుల క్రితం స్వ‌చ్చందంగా వైదొలిగారు. ఇక మ‌రో వైపు పురందేశ్వ‌రి అనుహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరి గతంలో రెండు సార్లు ఎంపీగా, అలాగే  కేంద్ర‌మంత్రిగా పని చేశారు. 
 
ఇక రాష్ట్రాలు విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత ఏపీలో కాంగ్రెస్ కొట్టుకు పోవ‌డంతో పురందేశ్వ‌రి బీజేపీలో చేరారు.  అయితే ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. కానీ త‌న‌యుడు హితేష్ చెంచురాం రాజ‌కీయ ఎంట్రీ ప‌రిస్థితి ప్ర‌స్తుతం అయేమ‌యంగా మారుతోంది. త‌ల్లి ఉన్న పార్టీలో రెండు సంవ‌త్స‌రాలు నుంచి పెద్ద‌గా ఫాలోయింగ్ లేదు. ఇక తండ్రి వ‌దిలివేసిన పార్టీ దాదాపుగా ఏపీలో క‌నుమ‌రుగు అయింది. దీంతో కొత్త దారులు వెత‌కాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది. త‌ల్లి దండ్ర‌లు వార‌స‌త్వాన్ని నిల‌బెడుతూ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి రావాల‌ని తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు హితేష్. గ‌తంలో త‌న తండ్రి ప్ర‌తినిథ్యం వ‌హించిన ప్ర‌కాశం జిల్లా ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయ్యాల‌ని ఆస‌క్తిగా ఉన్నార‌ట‌. అయితే హితేష్ ఏ పార్టీ నుంచి రంగంలోకి దిగాల‌నేది ఆస‌క్తిగా మారింద‌ట‌. 
 
మాములుగా అయితే త‌ల్లిదండ్రులు ఏ పార్టీలో ఉంటే వారి కూమారులు కూడా అదే పార్టీ నుంచి రాజ‌కీయం అరంగేట్రం చేస్తుంటారు. కానీ ఇక్క‌డ హితేష్ కు పెద్ద చిక్కు వ‌చ్చి ప‌డింది. పురందేశ్వ‌రి ఉన్న బీజేపీలో ప్ర‌స్తుతం అంతగా క్యాడ‌ర్ లేదు. పైగా విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన అంశాల‌ను కూడా బీజేపీ ప‌క్కన పెట్టింది. దీంతో  హితేష్ రాజ‌కీయ ప్ర‌వేశానికి బీజేపీ ఎట్టి ప‌రిస్థితిలో సూట‌బుల్ కాద‌ని భావిస్తున్నార‌ట‌. ఇక రాష్ట్ర విభ‌జ‌న చేసిన కాంగ్రెస్ ది ఇక్క‌డ దాదాపు ఇదే ప‌రిస్థితి. ఇక‌ మిగిలింది టీడీపీ, వైసీపీ, జ‌న‌సేన‌. జ‌న‌సేన కొత్త పార్టీ ఎంట్రీలోనే కొత్త పార్టీతో ప్ర‌యోగం ఎందుకు అని ద‌గ్గుబాటి ఫ్యామిలీ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నాయ‌ట‌. దీంతో జ‌న‌సేన రూట్ స‌రైన‌ది కాద‌ని తేలిపోయింది. 
 
ఇక తాత ఎన్టీఆర్ స్థాపించిన‌ టీడీపీలో చేర‌డానికి కొంత మేర‌కు అవ‌కాశాలు ఉన్న‌ప్ప‌టికి ద‌గ్గుబాటి ఫ్యామిలీకి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గు మ‌నేంత విభేదాలు ఉన్నాయి. అయిన‌ప్ప‌టికి రాజ‌కీయాల్లో శాశ్విత శ‌త్రువులు, శాశ్విత మిత్రులు ఉండ‌ర‌నేది చాలా సంద‌ర్భంలో రుజువు అయిన అశం. సో ఇక్క‌డ అదే రూట్ లో వెళ్లె హితేష్ టీడీపీ ద్వారా రాజ‌కీయ ఎంట్రీ అవ‌కాశాలు ఉంటాయ‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఇక టీడీపీ నుంచి ప్ర‌తిపాద‌న వ‌స్తే సానుకూలంగా స్పందిస్తుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. వివాదాల‌న్ని గ‌తం గ‌త‌హా అని నారా ద‌గ్గుపాటి ఫ్యామిలీలు క‌లిసిపోయినా ఆశ్య‌ర్య‌పోవాల్సిన అక్క‌ర్లేద‌నే వాద‌న‌లు స్థానికంగా వినిపిస్తునన్నాయి. 
 
అయితే హితేష్ టీడీపీలో చేరే విష‌యాన్ని తండ్రి వెంక‌టేశ్వ‌ర‌రావు వ్య‌తిరేకిస్తుంటే, త‌ల్లి పురందేశ్వ‌రి సానుకూలంగా స్పందిస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది.  టీడీపీ ఛాయిస్ కాదు అనుకుంటే ద‌గ్గుపాటి వార‌సుడికి ఇక మిగిలింది వైసీపీ మాత్ర‌మే. 
 
టీడీపీని గట్టిగా ఢీ కోడుతున్న వైసీపీవైపు దగ్గుపాటి మొగ్గు చూపుతున్న‌ట్లు స‌మాచారం. ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గానికి ఇద్దరు ముగ్గ‌రు ఇంచార్జ్ ల‌ను మార్చినా ప‌రిస్థితి చ‌క్క‌బ‌డ‌లేద‌న్న అభిప్రాయం వైసీపీలో ఉంది. వైసీపీ లెక్క‌ల ప్ర‌కారం ఈ సీటు ప‌డినా ప‌డ‌వ‌చ్చట‌. అందుకే తెర‌పైకి వ‌స్తే పెద్ద‌గా అభ్యంత‌రాలు ఉండ‌కపోవ‌చ్చు అంటున్నారు. 
 
పైగా ద‌గ్గుపాటి ఫ్యామిలీ వైసీపీలో చేరితే సామాజిక వ‌ర్గం నుంచి సానుకూల‌త ఉంటుంద‌నే ఉద్దేశంతో వైసీపీ నేత‌ల్లో ఉంది. ఇక ఆ క్యాలిక్లేష‌న్ తో త‌మ కుమారుడిని వైసీపీ నుంచి భ‌రిలోకి దించితే ఎలా ఉంటుంద‌నే అన్న దానికిపై ద‌గ్గుపాటి స‌న్నిహిత నేత‌ల వద్ద చ‌ర్చిస్తున్నార‌ట‌. ఇక ఈ వార‌సుడి రాజ‌కీయ అరంగేట్రం ట్విస్ట్ ఏంటంటే కోడుకు ఏ పార్టీలో చేరినా పురందేశ్వ‌రి మాత్రం బీజేపీలోనే ఉంటార‌ట‌. బీజేపీలో చేరిన‌ట‌ప్ప‌టినుంచి ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌ల‌కంటే ఆమె ఎక్కువ‌గా క‌ష్ట‌ప‌డుతున్నార‌నే అభిప్రాయాలు ఉన్నాయి. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.