షాకింగ్ ఎన్టీఆర్ ఆత్మ... ప‌గ‌ప‌ట్టింద‌ట‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-05 17:14:01

షాకింగ్ ఎన్టీఆర్ ఆత్మ... ప‌గ‌ప‌ట్టింద‌ట‌

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడికి, అలాగే హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ.... వీరిద్ద‌రు కొద్ది కాలంగా ఏ కార్య‌క్ర‌మం చేపట్టినా కూడా అందులో స‌క్సెస్ కాలేకపోతున్నారు. ఇక చంద్రబాబు నాయుడు అయితే 2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో మినీ మ‌హానాడు స‌భ‌ల‌ను ఏర్పాటు చేశారు. కానీ ఈ స‌భ‌లో చంద్ర‌బాబు నాయుడు ఊహించినంత విధంగా రిజ‌ల్ట్స్ రాలేదు.
 
అయితే మ‌రోవైపు నంద‌మూరి బాల‌కృష్ణ కూడా త‌న తండ్రి మాజీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌మూరి తార‌క రామారావు జీవిత చ‌రిత్ర ఆధారంగా చేసుకుని త‌న తండ్రి పాత్ర‌లో బాల‌య్య న‌టిస్తున్నారు. ఇక చిత్రానికి తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అయితే కొన్ని అనివార్య‌కార‌ణాల‌ వల్ల తేజ ద‌ర్శ‌కత్వ‌ బాధ్య‌తల నుంచి బ‌య‌టికి వ‌చ్చారు. దీంతో ఈ సినిమా షూటింగ్ మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. ఇక అప్ప‌టి నుంచి ఈ సినిమాకు అన్ని అడ్డంకులు త‌లెత్తుతూనే ఉన్నాయి. 
 
అయితే తాజాగా వ‌స్తున్న వార్త‌ల ప్ర‌కారం సినిమాపై అలాగే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వెన్నుపోటు రాజ‌కీయాల‌పై ఎన్టీఆర్ ఆత్మ ప‌గ‌ప‌ట్టిందా! అంటే అవున‌నే అంటున్నారు కొంత‌మంది. అయితే ఈ విష‌యాల‌ను  బీజేపీ పార్టీనో, వైసీపీనో లేక జ‌న‌సేన పార్టీ నాయ‌కులు ప్ర‌చారం చేస్తే అది ఫేక్ వార్త అన‌వ‌చ్చు కానీ సాక్షాత్తు టీడీపీకి చెందిన కొంద‌రు కీల‌క నాయకులే అంటున్నారు. క‌చ్చితంగా వీరిద్ద‌రిని ఎన్టీఆర్ ఆత్మ పీడిస్తోంద‌ని అందుకే వీళ్లు ఏ కార్య‌క్ర‌మం చేసినా కూడా స‌క్సెస్ కాలేక‌పోతున్నార‌ని టీడీపీ నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు.
 
అందుకోస‌మే చంద్ర‌బాబు నాయుడు, బాల‌కృష్ణలు క‌లిసి శాంతి పూజ‌లు చేయించుకోవాల‌ని టీడీపీ ముఖ్య‌నేత‌లు సూచిస్తున్నార‌ట‌. లేక‌పోతే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ ఆత్మ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంద‌ని అంటున్నార‌ట‌. ఇక ఇదే విష‌యంపై ఒక తెలుగు పత్రిక సవివరంగా వార్తను ప్రచురించింది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో మిత్ర‌ప‌క్షంగా ఉన్న పార్టీల‌న్నిటికి దూరం అయ్యారు టీడీపీ నాయ‌కులు. అలాగే చంద్ర‌బాబు నాయుడు త‌న న‌ల‌భై సంవ‌త్స‌రాల రాజ‌కీయ జీవితంలో ఎప్పుడు ఇన్ని క‌ష్టాలు ప‌డ‌లేదు.
 
అలాగే ఎన్టీఆర్ హయాం నుంచి నేటి ముఖ్య‌మంత్రి వ‌ర‌కు బీసీలు, ఎస్సీలు, కాపు నేత‌లంద‌రూ క‌లిసి టీడీపీ అధికారంలోకి వ‌చ్చినా రాకున్నా వీరు మాత్రం టీడీపీకే ఓటు వేసేవారు. కానీ ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఈ కులాల నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒక్క ఓటును కూడా రాబ‌ట్టుకునే ఛాన్స్ లేదు. అయితే వీట‌న్నింటికి కార‌ణం ఎన్టీఆర్ ఆత్మ పగబట్టిందేమో అన్న అనుమానాలను వ్య‌క్తం చేస్తున్నారు టీడీపీ ముఖ్య‌నేత‌లు. అయితే ఇందుకోసం త్వరలోనే శాంతి పూజలు కూడా చేయించనున్నారట.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.