జ‌న‌సేనకు కొత్త స‌మ‌స్య

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-05 02:54:11

జ‌న‌సేనకు కొత్త స‌మ‌స్య

జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇటీవ‌ల చ‌లోరే.. చ‌లోరే యాత్ర పేరుతో మూడు రోజుల పాటు అనంతపురం జిల్లాలో ప‌ర్య‌టించిన సంగ‌తి తెలిసిందే... ఈ యాత్ర‌లో భాగంగా అనంత రైతు స‌మ‌స్య‌ల‌ను ప్ర‌త్య‌క్షంగా అడిగి తెలుసుకుని, వారి స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వ దృష్టికి తీసుకువెళ్తాన‌ని హామీ ఇచ్చారు ప‌వ‌న్.
 
ఈ చ‌లోరే చ‌లోరే యాత్ర‌ను పూర్తి చేసుకుని త‌దుపరి యాత్ర కోసం సిద్ద‌మ‌వుతున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ కు.... తాజాగా ఏపీలో మ‌రో స‌మ‌స్యతో ప‌లువురు జ‌న‌సేన పార్టీ కార్యాలయానికి వ‌చ్చారు... ఉభ‌య గోదావ‌రికి చెందిన న‌ర్స‌రీ పెంప‌కం దారులు త‌మ‌ను రైతులుగా గుర్తించాలంటూ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ను క‌లిశారు.
 
అయితే  గ‌తంలో త‌మ స‌మ‌స్య‌ల‌ను అనేక సార్లు ప్ర‌భుత్వం దృష్టికి తీసుకు వెళ్లినా కాని త‌మ‌ని అధికారులు ప‌ట్టించుకోవ‌డంలేద‌ని న‌ర్సిరీ పెంప‌కం దారులు ప‌వ‌న్ తో చెప్పుకొచ్చారు...  వివిధ ర‌కాల మెక్క‌ల‌ను త‌యారు చేసి రాష్ట్రానికి అందిస్తున్న న‌ర్స‌రీ పెంప‌కం  దారుల‌ను  కూడా రైతులుగా గుర్తించి ఉచిత క‌రెంట్ అందించేలా కృషి చేస్తాన‌ని, ఈ విష‌యాన్ని  సీఎం దృష్టికి తీసుకు వెళ్తాన‌ని హామి ఇచ్చారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.