ప్రాణం పోయినా టీడీపీకి వెళ్ల‌ను వైసీపీ ఎమ్మెల్యే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-30 12:12:47

ప్రాణం పోయినా టీడీపీకి వెళ్ల‌ను వైసీపీ ఎమ్మెల్యే

ఆపరేష‌న్ ఆక‌ర్ష్ 2 కు తెలుగుదేశం రెడీ అయ్యింది.. ఇటు నెల్లూరు జిల్లాలో జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తున్న స‌మ‌యంలో, పార్టీలో కీల‌క నాయ‌కుల‌ను.. ఎమ్మెల్యేల‌కు.. సీనియ‌ర్ల‌కు వ‌ల‌వేసి పార్టీలోకి తీసుకోవాలి అని తెలుగుదేశం నాయ‌కులు ఆలోచించారు... అయితే పార్టీలో ఉన్న నాయ‌కులు సీనియ‌ర్లు మాత్రం తెలుగుదేశంలోకి వెళ్లిన దాఖ‌లాలు లేవు, అయితే చిత్తూరు జిల్లాలో జ‌గ‌న్ ఉండ‌గానే ప‌లు చోట్ల జ‌గ‌న్ పార్టీని ఇరుకున పెట్టాలి అని నెల్లూరులో వైసీపీ ఎమ్మెల్యేకి గాలం వేసింది తెలుగుదేశం పార్టీ.

తాజాగా కృష్ణాజిల్లాలో ఓ సీనియ‌ర్ ఎమ్మెల్యే పై తెలుగుదేశం పార్టీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ప్ర‌యోగిస్తోంది అనే వార్త‌లు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా ఇక్క‌డ నూజివీడు వైసీపీ ఎమ్మెల్యే పై ఆప‌రేష‌న్ ఫిరాయింపు ప్ర‌యోగించాలి అని తెలుగుదేశం ఆలోచిస్తోంది... కాని ఎమ్మెల్యే మాత్రం స‌సేమిరా అంటున్నారు.. నాప్రాణం పోయినా తాను టీడీపీలోకి వెళ్ల‌ను అని అంటున్నారు నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు.

నూజివీడును ఎవ‌రూ చేయ‌నంత అభివృద్ది తాను చేశాను, గ‌తంలో వైయ‌స్ సీఎంగా ఉన్న స‌మ‌యంలో త‌న‌కు ఎంతో తోడ్పాటు అందించార‌ని ఆయ‌న అన్నారు... జ‌గన్ కు తోడుగా ఉంటాన‌ని , మహానేత కుమారుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన పార్టీలో ఆయనకు అండగా ఉండాల్సిన బాధ్యత తనకు ఉందన్నారు.

తన శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసినా పార్టీ మారాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఎమ్మెల్యే నిధులు ఇవ్వని దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయన్నారు.అయినా ప్ర‌జ‌లు త‌న‌ను విశ్వ‌సిస్తున్నారు అని అన్నారు ఎమ్మెల్యే ప్ర‌తాప్.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.