మ‌రోసారి ఆనం జ‌గ‌న్ తో భేటీ కార‌ణం ఇదే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-20 13:39:35

మ‌రోసారి ఆనం జ‌గ‌న్ తో భేటీ కార‌ణం ఇదే

ఏపీ ప్రతిప‌క్ష నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జాసంక‌ల్ప‌యాత్రకు ప్ర‌జ‌లు అడుగ‌డుగునా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ 2019లో వైసీపీ అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాల‌ను ప్ర‌జ‌లు వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్. అయితే ప్ర‌స్తుతం అధికార తెలుగుదేశం పార్టీ కంచుకోట తూర్పుగోదావ‌రి జిల్లాలో ఈ పాద‌యాత్ర నిర్విరామంగా కొన‌సాగుతోంది. 
 
ఇక ఇప్ప‌టికే జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో భాగంగా 216 రోజులను పూర్తి చేసుకున్నారు.  నేడు 217 రోజున  మండపేట నియోజకవర్గంలో పాద‌యాత్ర చేయాల్సి ఉంది. కానీ కోర్ట్ విచార‌ణ నిమిత్తం ప్ర‌తి శుక్ర‌వారం జ‌గ‌న్ కోర్టుకు హాజ‌రు కావాల్సి ఉంది. అందులో భాగంగానే ఈ రోజు ఉద‌యం హైద‌రాబాద్ లోని లోట‌స్ పాండ్ చేరుకున్నారు. 
 
ఇక ఆయ‌న లోట‌స్ పాండ్ చేరుకోగానే మాజీ మంత్రి టీడీపీ నేత ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి, జ‌గన్ ను క‌లిశారు. లోట‌స్ పాండ్ లో వీరిద్ద‌రు సుమారు గంట సేపు మాట్లాడుకున్నారు. ఆ స‌మావేశంలో ఆనం త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ గురించి జ‌గ‌న్ కు వివ‌రించినట్లు తెలుస్తోంది. అయితే జ‌గ‌న్ కూడా ఆయ‌న రాజ‌కీయంపై సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఆనంను వైసీపీ నేతలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఇక్కడికి తీసుకువచ్చినట్టు సమాచారం.
 
కాగా ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి త‌న సోద‌రుడు మ‌ర‌ణించిన‌ప్ప‌టి నుంచి టీడీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. అంతేకాదు మినీ మ‌హానాడులో కూడా పార్టీ నాయ‌కుల‌పై బ‌హిరంగంగానే విమ‌ర్శ‌లు చేశారు. దీంతో ఆయ‌న పార్టీ మార‌డం ఖాయం తేలింది. కానీ ఏ పార్టీ లో చేరుతార‌నేది మాత్రం స్ప‌ష్టం చేయ‌లేదు. అయితే ఈ మ‌ధ్య‌కాలంలో జ‌గ‌న్ ను శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆనం క‌లిశారు. అప్పుడు కూడా ఆనం త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్‌ గురించి జ‌గ‌న్ చ‌ర్చించినట్లు తెలుస్తోంది. ఒక‌టే నెలలో రెండుసార్లు క‌ల‌వ‌డం చూస్తుంటే మ‌రికొద్ది రోజుల్లో ఆనం ఫ్యామిలీ వైసీపీ తీర్థం తీసుకోనుంద‌ని తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.