ఏపీలో మ‌రోసారి ఉప‌ ఎన్నిక‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

byelections
Updated:  2018-05-18 17:50:19

ఏపీలో మ‌రోసారి ఉప‌ ఎన్నిక‌లు

ప్ర‌త్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అలుపెరుగ‌ని పోరాటం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అలాగే ఆయ‌న‌ ఆదేశాల మేర‌కు వైసీపీ నెల్లూరు ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి, ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి, తిరుప‌తి ఎంపీ వ‌ర‌ప్ర‌సాద్, క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిలు రాజీనామా చేసి త‌మ ప్రాణాల‌ను సైతం లెక్క‌చేయ‌కుండా ఢిల్లీలోని ఏపీ భ‌వ‌న్ లో సుమారు వారం రోజుల‌పాటు నిరాహార దీక్ష చేసిన సంగ‌తి తెలిసిందే. 
 
ఇక తాజాగా వారి రాజీనామాల‌ను స్పీక‌ర్ త్వ‌ర‌లో ఆమోదించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో మ‌రోసారి ఏపీలో ఉప ఎన్నిక‌లు జ‌రిగే ఆస్కారం ఎక్కువ‌గా ఉన్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు తెలుపుతున్నారు. ఇక ఇదే విష‌యాన్ని ఏపీ ముఖ్యమంత్రి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు కూడా కేబినెట్ స‌మావేశంలో చ‌ర్చించారు. ఇక ఆయ‌న చ‌ర్చించారంటే క‌చ్చితంగా ఉప ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని తెలుస్తోంది.. ఈ ఎన్నిక‌లు కూడా అతి త్వ‌ర‌లో జ‌రిగే ఛాన్స్ ఉంది. ఎందుకుంటే ఈ 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లకు కేవ‌లం ప‌ది నెల‌ల స‌మ‌యం మాత్ర‌మే ఉంది కాబట్టి ఈ మ‌ధ్య‌కాలంలో ఉప ఎన్నిక‌లు జ‌రిగే ఆస్కారం ఎక్కువ‌గా ఉంద‌ని తెలుస్తోంది.
 
అయితే గ‌తంలో టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కూడా  వైసీపీ ఎంపీలు రాజీనామా చేసిన‌ప్పుడు ఎగ‌తాళి చేస్తూ ఎట్టి ప‌రిస్థితిలో రాజీనామాల‌ను ఆమోదంపోంద‌ద‌ని, మ‌ళ్లీ ఉప ఎన్నిక‌లు జ‌రుగ‌వ‌ని ఎద్దేవా చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఊహించ‌ని ప‌రిణామాల నేప‌థ్యంలో వైసీపీ వైసీపీ ఎంపీల రాజీనామాలను స్పీక‌ర్ ఆమోదించ‌నున్నార‌నే స‌మాచారం తెలియ‌డంతో టీడీపీ నాయ‌కులు కంగుతున్నారు. ఇక ఈ ఐదు స్థానాల్లో ఎన్నిక‌లు జ‌రిగితే మ‌రోసారి వైసీపీ త‌మ స‌త్తా చాటేందుకు సిద్దాంగా ఉంది. దీని ప్ర‌భావం క‌చ్చితంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌డ‌నుంది. దీంతో ఒక‌వైపు టీడీపీతో పాటు వైసీపీ నాయ‌కులు కూడా చర్చించుకుంటున్నార‌ని తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.