పొత్తుల‌పై మ‌రోసారి రెచ్చిపోయిన కేఈ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu naidu and ke krishna murthi
Updated:  2018-09-11 10:36:55

పొత్తుల‌పై మ‌రోసారి రెచ్చిపోయిన కేఈ

2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న‌త‌రుణంలో ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఎన్నిక‌ల పోటీపై ఎలాంటి పొత్తుల‌ నిర్ణ‌యం తీసుకోక ముందే పార్టీకి చెందిన ముగ్గురు మంత్రులు రెచ్చిపోయి మీడియా ముందు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో కాంగ్రెస్, టీడీపీ పొత్తు పెట్టుకునే ప్ర‌స‌క్తే లేద‌ని, ఒకవేళ‌ చంద్ర‌బాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే డిప్యూటి ముఖ్య‌మంత్రి కేఈ కృష్ణ మూర్తి ఉరి వేసుకుంటాన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.
 
ఇక మ‌రో మంత్రి అయ్య‌న్న పాత్రుడు పొత్తుల‌పై పలు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మాజీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌మూరి తార‌క రామారావు కాంగ్రెస్ పార్టీకి వ్య‌తిరేకంగా పార్టీని స్థాపించారని అలాంటిది ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే రాష్ట్ర ప్ర‌జ‌లు కొడ‌తార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.
 
ఇక మ‌రో మంత్రి చినరాజ‌ప్ప కూడా తాజాగా పొత్తుల‌పై  ప‌లు ఆస‌క్తి క‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇక వారు చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు పార్టీ అధిష్టానం స్పందించి పొత్తులు అన్న‌ది పార్టీ పొలిటిక‌ల్ బ్యూరో నిర్ణ‌యాలు తీసుకుంటార‌ని ఈ విష‌యాల‌ను మంత్రులు గ‌మ‌నించాల‌ని సీఎం హెచ్చ‌రించారు. అయితే వారికి హెచ్చ‌రిక‌లను పంపినా  కూడా మంత్రులు మాత్రం పొత్తుల‌పై విమ‌ర